Pawan Kalyan Fans : త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. గురూజీ కోసం రంగంలోకి దిగిన థమన్..

త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురూజీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ ని సపోర్ట్ చేస్తూ థమన్..

Pawan Kalyan Fans – Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా రీమేక్ సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. 2017 లో వచ్చిన ‘కాటమరాయుడు’ నుంచి ఇప్పుడు వచ్చిన ‘బ్రో’ (Bro) వరకు అన్ని రీమేక్‌లే. ఈ చిత్రాల మధ్యలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ స్ట్రెయిట్ అయినప్పటికీ.. అన్ అఫీషియల్ గా అదికూడా హాలీవుడ్ మూవీకి రీమేక్ చిత్రమే. కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఇలా వరుసపెట్టి రీమేక్స్ తో ఆడియన్స్ కి చిరాకు వచ్చేసింది. దీంతో పవన్ అభిమానులంతా త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Vijay Deverakonda : స్పీడ్ పెంచేసిన విజయ్ దేవరకొండ.. రెండు సినిమాల షూటింగ్స్‌తో..!

ఈ రీమేక్స్ కి త్రివిక్రమ్ కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా..? పవన్ కి దాదాపు ఈ సినిమాలు అన్ని సజస్ట్ చేసింది గురుజీనే. మిగతా హీరోలా పవన్ నుంచి తన అభిమానులు భారీ సినిమాలు కోరుకుంటున్నారు. కానీ పవన్ రొటీన్ రీమేక్స్ తో వస్తుండడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. దీంతో ఆ రీమేక్స్ సజస్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బ్రో మూవీతో ఈ ట్రోలింగ్ మరింత పెరిగింది. ఇక ఈ విషయం మూవీ టీం వరకు వెళ్లినట్లు తెలుస్తుంది.

Pawan Kalyan : ఎన్నికల్లో నెగ్గిన దిల్ రాజుకి జనసేన పవన్ కళ్యాణ్ అభినందనలు..

దీంతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ త్రివిక్రమ్ ని బ్యాక్ అప్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్ ఫోటో షేర్ చేస్తూ.. లవ్ ఈమోజీతో తనని సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన పవన్ అభిమానులు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.. “మాకు త్రివిక్రమ్ అంటే ఎలాంటి కోపం లేదు. కానీ ఒక నెంబర్ వన్ స్టార్ తో ఓటీటీ టైములో ఇలా రీమేక్స్ చేయడం కరెక్ట్ కాదని గురూజీకి చెప్పండి” అంటూ పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు