Kalki 2898 AD : ప్రభాస్ కల్కి సినిమా టైటిల్‌లో ఇది గమనించారా..? మొత్తం 14 భాషల్లో..!

ప్రభాస్ కల్కి గ్లింప్స్ లో టైటిల్‌ పడే సమయంలో మీరు ఒక విషయం గమనించి ఉండరు. అదేంటో ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.

Prabhas Kamal Haasan Kalki 2898 AD will be released in 14 languages

Kalki 2898 AD : ప్రభాస్ (Prabhas) సూపర్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న సినిమా కల్కి (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా కనిపిస్తుండగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, పశుపతి, శాశ్వత ఛటర్జీ.. వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ని ఇటీవల అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Bro Movie : బ్రో శ్లోకంకి టెస్లా కారుల లైట్ షో సూపర్.. వైరల్ అవుతున్న వీడియో చూశారా..?

అయితే ఆ గ్లింప్స్ లో కల్కి అనే టైటిల్ పడే సమయంలో మీరు ఒక విషయం గమనించి ఉండరు. కల్కి అనే టైటిల్ పడే సమయంలో ‘క’ అనే అక్షరాన్ని మొత్తం 14 భాషల్లో చూపించారు. ఆ తరువాత అక్షరాల్ని కూడా అదే తరహాలో చూపించారు. అంటే ఈ సినిమాని మొత్తం 14 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ భాషలో ఏంటో ఇక్కడ చూసి తెలుసుకోండి.

క – Telugu
ಎ – Kannada
കെ – Malayalam
क – Hindi
અ – Gujrati
ক – Bengali
କା – Odia
K – English
ケイ – Japanese
凯 – Chinese
ค – Thai
ی – Persian
Κέι – Greek
ơc – Vietnamese

Oppenheimer : శృంగార స‌న్నివేశంలో భగవద్గీత.. మండిప‌డుతున్న భార‌తీయులు.. తొల‌గించ‌క‌పోతే ఊరుకోం

కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కలియుగాంతం చివర్లో ఈ సినిమా కథ మొదలు కాబోతుంది. 2898 AD లో ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు విష్ణుమూర్తి 10వ అవతారం కల్కి ఉద్భవించి ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది సినిమా కథ అని గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని సమ్మర్ రేస్ కి షిఫ్ట్ అయ్యినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు