Hollywood : మొన్నటిదాకా రైటర్స్.. ఇప్పుడు యాక్టర్స్.. సమ్మె చేస్తున్న హాలీవుడ్ ఆర్టిస్టులు.. హాలీవుడ్ మూత పడనుందా?

ఇటీవల నెల రోజుల క్రితం హాలీవుడ్(Hollywood) లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా(Writers Guild of America) సమ్మెకు దిగింది. ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్స్ కూడా సమ్మెకు దిగారు.

Screen Actors Guild Association joins in Strike it effects Hollywood

Screen Actors Guild Strike :  ఇటీవల నెల రోజుల క్రితం హాలీవుడ్(Hollywood) లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా(Writers Guild of America) సమ్మెకు దిగింది. నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తున్నా తమకు మాత్రం కనీస వేతనం ఇవ్వట్లేదంటూ, కొంతమంది కథల కోసం AI దగ్గరకు వెళ్తుండటం.. ఇలా పలు అంశాలతో సమ్మెకు దిగారు. దాదాపు నెలరోజులు నుంచి ఈ సమ్మె సాగుతూనే ఉంది. ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్స్ కూడా సమ్మెకు దిగారు.

స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ SAG (Screen Actors Guild) సడెన్ గా సమ్మెకు దిగింది. రైటర్స్ సమ్మెకు దిగినప్పుడు నిర్మాణ సంస్థల యూనియన్ అయిన AMPTP (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో మాట్లాడి తమ డిమాండ్స్ చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కూడా AMPTP తో మాట్లాడినా వారు పట్టించుకోకపోవడంతో అకస్మాత్తుగా సమ్మెకు దిగారు. ఆల్మోస్ట్ స్టార్ యాక్టర్స్ కాకుండా దాదాపు 80 శాతం మంది యాక్టర్స్ నిన్న అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి దిగారు.

రైటర్స్ కోరుకుంటున్న డిమాండ్స్ యాక్టర్స్ కూడా కోరుకుంటున్నారు. నిర్మాణ సంస్థలు మంచి లాభాలు ఆర్జిస్తున్నా సరైన వేతనాలు ఇవ్వట్లేదని, సినిమాకు ప్రాఫిట్స్ వస్తున్నా మా రెమ్యునరేషన్స్ ఇవ్వట్లేదని, సినిమా నిర్మాణంలో AI ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పాత్రని తగ్గించాలని, హెల్త్, ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వట్లేదని, షూటింగ్ లో సరైన సదుపాయాలు కూడా కలిపించట్లేదని చెప్తూ సమ్మెకు దిగారు. ఈ మేరకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డిశ్చర్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న రాత్రి స్ట్రైక్ అనౌన్స్ చేశారు. రైటర్స్ గిల్డ్ అమెరికా సమ్మెకు కూడా వీళ్ళు మద్దతు ఇచ్చారు.

Aditi Shankar : సంవత్సరం టైం.. అవకాశాలు రాకపోతే సినిమా పేరెత్తకూడదు.. కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్..

దీంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు, స్ట్రీమింగ్ ఓటీటీలు, టీవీ సంస్థలు తలలు పట్టుకున్నాయి. ఈ సమ్మె త్వరగా విరమించకపోతే టెలికాస్ట్ చేయడానికి కంటెంట్ ఉండదని అవి భయపడుతున్నాయి. దీంతో హాలీవుడ్ కొన్ని రోజులు మూతపడనుందా, కార్యక్రమాలు ఆగిపోనున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సమ్మె జరుగుతున్నప్పుడు తమ పాత సినిమాలు కూడా యాక్టర్స్ ప్రమోట్ చేయడానికి వీల్లేదు. దీంతో త్వరలో పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి ఉండటంతో వాటి ప్రమోషన్స్ మీద కూడా ఈ సమ్మె ఎఫెక్ట్ పడనుంది.

ట్రెండింగ్ వార్తలు