Pawar vs Pawar: ఒకే వేదిక మీదకు శరద్ పవార్, అజిత్ పవార్.. ఎన్సీపీ చీలిన తర్వాత ఇదే తొలిసారి

అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారని అజత్ వర్గం చెప్తూ వస్తోంది

Maharashtra Politics: వచ్చే నెలలో పూణేలో జరిగే కార్యక్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్.. తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఒకే వేదికను పంచుకోనున్నారు. మహారాష్ట్రలో ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజా విషయం భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ నెల ప్రారంభంలో ఎన్సీపీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను అజిత్ పవార్ తన వెంటబెట్టుకుని తిరుగుబాటు చేసిన విషయం తెలిసింది. అనంతరం బీజేపీ-శివసేన నేతృత్వంలోని కూటమిలో చేరారు.

Himanshu Rao: ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చిన కల్వకుంట్ల హిమాన్షు.. అప్పట్లో కన్నీళ్లు వచ్చాయని కామెంట్స్

ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తిరుగుబాటు నేతలకు వ్యతిరేకంగా శరద్ పవార్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కూడా చేపట్టారు. అలాంటి వారిని నమ్మి తప్పు చేశానని ప్రజలతో చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మోదీ, పవార్ వేదిక పంచుకోబోతుండడం గమనార్హం. ఆగస్టు 1న జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ లోకమాన్య తిలక్ అవార్డును అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి షిండే సహా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హాజరు అవుతున్నారు. అయితే ఎన్సీపీ చీలిక పవార్ ఆడిస్తున్న పొలిటికల్ గేమ్ అని వస్తున్న విమర్శలకు ఇది ఊతం ఇస్తోంది.

CI Viral Video: జనసేన నాయకుడి చెంపచెళ్లుమనిపించిన మహిళా సీఐ.. అప్పుడు, మళ్లీ ఇప్పుడు..

అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారని అజత్ వర్గం చెప్తూ వస్తోంది. ఈ వ్యాఖ్య గందరగోళాన్ని మరింత పెంచింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు గత నాలుగేళ్లలో మూడుసార్లు బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధమయ్యారని అజిత్ పవార్ అన్నారు.

Chandrababu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చర్చలను శరద్ పవార్ గోప్యంగా ఉంచారని, చర్చల చివరి క్షణంలో ఆ ప్రతిపాదనలు ఉపసంహరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. తిరుగుబాటుకు రెండు రోజుల ముందు ఎన్సీపీ గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్సీపీని అవినీతి పార్టీ అంటూ.. సాగునీటి ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. ఆ తర్వాత అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీతో చేతులు కలిపారు.

ట్రెండింగ్ వార్తలు