Chandrababu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై వివాదం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి మాట్లాడారు.

Chandrababu Naidu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ (Chit Chat) చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ (volunteer system) పై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యల స్పందిస్తూ.. “వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదు. వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహం. దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సేవ వరకే వాలంటీర్లను పరిమితం చేసేలా చూస్తామని” అన్నారు.

ఏపీ ప్రయోజనాలే నాకు ముఖ్యం
టీడీపీతో పొత్తు ఉంటుందని కేంద్ర మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే ఇప్పుడు నాకు ముఖ్యం. దీనిపై ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకొచ్చి సెట్ చేయటమే నా ముందున్న లక్ష్యం. పెద్ద బాధ్యత నాపై ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలూ అవసరం. ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించి చులకన కాదల్చుకోలేదు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం-ప్రజలు గట్టిగా ఉంటే కేంద్రం ఎందుకు దిగిరాదనటానికి జల్లికట్టు ఘటనే ఓ ఉదాహరణ. గత నాలుగన్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం చేశాడా? ఓట్ల అవకతవకలపై ఢిల్లీని కూడా వదిలిపెట్టను. అక్రమాలు సరిదిద్దకపోతే ఎన్నికల సంఘం విశ్వసనీయత కూడా పోతుందని” పేర్కొన్నారు.

500 రూపాయల నోట్లను రద్దు చేయాలి
500 రూపాయల నోట్లను రద్దు చేస్తే ఎన్నికల్లో అవినీతి తగ్గుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. “రూ.500 నోట్లు కూడా రద్దు చేసేస్తే ఎన్నికల్లో డబ్బులు పంచే శని వదిలిపోతుంది. రాజకీయాల ద్వారా సేవ చేయాలంటే డబ్బులు పంచాలా?” అని ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతూ.. ఏపీ-మహారాష్ట్ర లను కలిపేస్తే మూడు రాజధానులు- ముగ్గురు సీఎంల సమస్య తీరుతుందనే జోకులు హల్చల్ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా తానేం చేశానో ప్రజలు చూశారని, గత నాలుగేళ్లుగా జగన్ ఏం చేస్తున్నాడో కూడా బేరీజు వేసుకున్నారని.. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడో వింటున్నారని చెప్పారు.

Also Read: జగన్ మూర్ఖత్వానికి ఒక జాతి మొత్తం బలి అవ్వాలా? ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ కట్టలేదు..

2004లో అందుకే ఓడిపోయా
తాను అమలు చేసిన పరిపాలనా సంస్కరణల వల్లే గతంలో తాను ఓడిపోయానని చంద్రబాబు గుర్తు చేశారు. “పవర్ రిఫార్మ్స్ వల్ల 2004లో నా పవర్ పోయినా రాష్ట్రం బాగుపడింది. ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ చేసే సంస్కరణలు తీసుకోస్తాం. ఏపీలో అమలయ్యే విద్యుత్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచే చర్యలు చేపడతాం. ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్తే నాకు ఓట్లు పడకపోవచ్చు. ఈ తరం వారికి చేసిన కృషి తెలియకపోవచ్చు. కానీ నేను అభివృద్ధి చేశాననే సంతృప్తి మాత్రం నాకుంది. భవిష్యత్తుకు గ్యారెంటీ కింద నేను కూడా త్వరలోనే పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతామని” తెలిపారు.

Also Read: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా ఎందుకు స్పందిచడం లేదు?

ట్రెండింగ్ వార్తలు