Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా..

వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా పెద్దాయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఇంతకీ ముద్రగడ మనసులో ఏముంది? వైసీపీ ఆహ్వానంపై ఎందుకు స్పందించడం లేదు. తెర వెనుక ఏం జరుగుతోంది?

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా..

Mudragada Padmanabham Silence

Mudragada Padmanabham Silence: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైలెంట్‌ అయిపోయారు.. గత నెలలో జనసేనాని పవన్‌పై లేఖలతో విరుచుకుపడిన ముద్రగడ ఇప్పుడు ఎక్కడా పల్లెత్తు మాట కూడా ఆడటం లేదు. వారాహి యాత్ర (varahi vijaya yatra) సమయంలో ఓ లెవెల్‌లో దుమారం రేపిన పెద్దాయనను పార్టీలోకి చేర్చుకోడానికి అధికార పార్టీ వైసీపీ (YCP) ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. రీజనల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి (Mithun Reddy)తోపాటు ఎంపీ వంగా గీత (Vanga Geetha) కొంతమంది ఎమ్మెల్యేలు ముద్రగడను వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా పెద్దాయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఇంతకీ ముద్రగడ మనసులో ఏముంది? వైసీపీ ఆహ్వానంపై ఎందుకు స్పందించడం లేదు. తెర వెనుక ఏం జరుగుతోంది?

జనసేనాని పవన్ తొలివిడత వారాహి యాత్ర సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లు కాకరేపాయి. కాపు ఉద్యమం నుంచి అధికార పార్టీ నేతలపై విమర్శల వరకు.. జనసేనాని వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చి హాట్‌టాపిక్‌ అయ్యారు ముద్రగడ. వరుసగా రెండు లేఖలు రాసి జనసేనానిపై ఫైర్‌ అయ్యారు. అదేసమయంలో పవన్‌పై పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. అవసరమైతే పిఠాపురంలో తేల్చుకుందాం.. రమ్మంటూ సవాల్‌ చేశారు. ఎప్పుడో రాజకీయాల నుంచి విరమించుకున్న ముద్రగడ.. మళ్లీ పోటీకి సై అనడంతో అనేక అనుమానాలు వ్యక్తమవయ్యాయి. పెద్దాయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? స్వతంత్ర్యంగా పోటీ చేస్తారా? అధికార పార్టీలో చేరతారా? అనే చర్చ సాగింది.

Also Read: పవన్ కల్యాణ్‌కు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి- వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఇదే సమయంలో ముద్రగడ.. పవన్‌ మధ్య రేగిన వివాదాన్ని క్యాష్‌ చేసుకోవాలని భావించింది అధికార వైసీపి. పవన్‌ దూకుడికి కళ్లెం వేయాలంటే సరైనోడు ముద్రగడే అని భావించింది అధికార పార్టీ. అంతేకాదు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు భేషరతు ప్రకటన చేశారు ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ సమన్వయకర్త మిథున్‌రెడ్డి. వైసీపీలో కీలక బాధ్యతల్లో ఉన్న మిథున్‌రెడ్డి ప్రకటన అందరిలోనూ ఆసక్తి రేపింది. మరోవైపు ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే కాపు ఓట్లను.. ముద్రగడ అభిమానుల ఓట్లను కొల్లగొట్టొచ్చని ప్లాన్‌ చేసిన అధికార పార్టీ ఎంపీ వంగా గీతతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలను కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి పంపింది. వైసీపీ నేతలతో భేటీ అయిన ముద్రగడ ఏం చెప్పారోగాని.. ఆ తర్వాత జరిగిన వారాహి ఎపిసోడ్‌లో పెద్ద రచ్చే చేశారు ముద్రగడ. రాజకీయంగా ఇది వాడుకోవాలని అనుకున్న వైసీపీ పెద్దాయనకు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చినా.. ఆయన మాత్రం వైసీపీ ఆహ్వానంపై స్పందించడం లేదు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది.. అసంతృప్తిగా ఉన్నారా?

ముద్రగడ వైసీపీలో చేరినా చేరకపోయినా ఆయనపై అధికార పార్టీ మనిషి అనే ముద్ర వేసేసింది జనసేన. ముద్రగడ రాసిన రెండు లేఖలపై పవన్‌ అభిమానులు.. కాపు నేత హరిరామజోగయ్య వంటివారు ఫైర్‌ అవ్వడంతో ముద్రగడ నొచ్చుకున్నారని అందుకే ఎందుకీ గొడవ అని సైలెంట్‌ అయిపోయారనే మరో టాక్‌ వినిపిస్తోంది. వాస్తవానికి ముద్రగడకు రాజకీయం అంటే పెద్దగా ఆసక్తి ఉండదని.. రాజకీయాల్లో ఇమడలేకే ఎన్టీఆర్‌ హయాంలో మంత్రి పదవిని సైతం వదులుకున్నారని చెబుతుంటారు. ఇప్పుడు ఈ వాడివేడి రాజకీయాల్లో నెట్టుకు రావడం ముద్రగడ నైజానికి అస్సలు సరిపడదని అందుకే ఆయన సైలెంట్‌ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.