Kiara Advani : బాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ బ్రేకప్??

'భరత్ అనే నేను' సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీళ్ళు డేటింగ్ కూడా చేస్తున్నారు అని బాలీవుడ్.........

Kiara Advani : :  గత కొద్ది కాలంగా బాలీవుడ్ లో ఒకపక్క వరుసగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరోవైపు కొంతమంది లవ్ బర్డ్స్ బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు. ఇటీవల లైగర్‌ బ్యూటీ అనన్య పాండే తన ప్రియుడు ఇషాన్‌ ఖట్టర్‌తో విడిపోయింది. తాజాగా మరో బాలీవుడ్ జంట బ్రేకప్ చెప్పుకుంది అని వార్తలు వస్తున్నాయి.

‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హిందీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీళ్ళు డేటింగ్ కూడా చేస్తున్నారు అని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. ‘షేర్షా’ సినిమాలో వీరిద్దరూ కలిసి తొలిసారి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Acharya : మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈ సినిమా టైంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పట్నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు బాలీవుడ్ పార్టీలలో కలిసి వెళ్లేవారు. పలుసార్లు వీరిద్దరూ జంటగా మీడియాకి చిక్కారు. వీరి సన్నిహితులు కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే చెప్పారు. అయితే తాజాగా సిద్దార్థ్ – కియారా బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళ ప్రేమ ముగిసినట్టేనా అంటే బాలీవుడ్ మీడియా అవుననే అంటుంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోయినా సన్నిహిత వర్గాలు మాత్రం వీరు బ్రేకప్ చెప్పుకున్నారు అనే చెప్తున్నారు. బాలీవుడ్ లో సెలబ్రిటీలు ఇలా ఒకవైపు పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరోవైపు ఇలా బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు