Rahul Tripathi : అది చాలా క్లిష్టసమయం.. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ త్రిపాఠి వ్యాఖ్య‌లు..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ రాహుల్ త్రిపాఠి అద‌ర‌గొడుతున్నాడు.

Rahul Tripathi – SRH : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ రాహుల్ త్రిపాఠి అద‌ర‌గొడుతున్నాడు. అయితే.. తుది జ‌ట్టులో అవ‌కాశం కోసం వేచి ఉండ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం అని చెప్పాడు. ఈ సీజ‌న్‌లో కేవ‌లం 5 మ్యాచుల్లో మాత్ర‌మే ఆడే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని చ‌క్క‌గా వినియోగించుకుని జ‌ట్టు విజ‌యాల్లో త‌న వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఐదు మ్యాచుల్లో 152.94 స్ట్రైక్‌రేటుతో 156 ప‌రుగులు చేశాడు. ఈ ఐదు మ్యాచుల్లో 17 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాదాడు.

జియో సినిమాతో రాహుల్ త్రిపాఠి మాట్లాడాడు. ఈ సీజ‌న్‌లో అవ‌కాశం కోసం చాలా స‌మ‌యం వేచి ఉండాల్సి వ‌చ్చింది. అది ఎంతో క‌ష్టంగా అనిపించింది. అయితే.. తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌క‌పోయిన‌ప్ప‌టికీ కూడా జ‌ట్టుకు ఎలా స‌హాయ ప‌డాల‌ని ఆలోచించేవాడిన‌ని త్రిపాఠి చెప్పాడు. ఎప్పుడు అవ‌కాశం ద‌క్కినా కూడా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవాడిన‌ని, ఇందుకోసం తీవ్రంగా శ్ర‌మించే వాడిన‌ని తెలిపాడు.

Shakib Al Hasan : 14 వేల ప‌రుగులు, 700 వికెట్లు.. క్రికెట్ చ‌రిత్ర‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ఒకే ఒక్క‌డు..

ఈ శ్ర‌మ‌తో ఉత్త‌మ ఫ‌లితాలు సాధిస్తున్నాన‌ని, జ‌ట్టులో స్థానం దొర‌క‌లేద‌ని ఎప్పుడూ బాధ‌ప‌డ‌లేద‌న్నాడు. దొరికిన‌ప్పుడు మాత్రం అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌నే ఆలోచ‌నే త‌న‌ను ముందు న‌డిపిస్తుంద‌ని చెప్పాడు.

కాగా.. రాహుల్ త్రిపాఠిలో సీజ‌న్‌లో ఆరంభంలో తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. ఆఖ‌రి ద‌శ‌లో జ‌ట్టులో స్థానం ద‌క్కింది. ప్లే ఆఫ్స్ మ్యాచుల్లో అద‌ర‌గొట్టాడు. మ‌రోసారి అలాంటి ప్ర‌ద‌ర్శ‌ననే ఫైన‌ల్‌లోనూ చేసి జ‌ట్టుకు క‌ప్పు అందించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆదివారం చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ముఖాముఖిగా 27 సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో కోల్‌క‌తా 18 సార్లు విజ‌యం సాధించ‌గా, హైద‌రాబాద్ 9 సార్లు గెలుపొందింది. ఈ సీజ‌న్‌లో రెండు సార్లు త‌ల‌ప‌డ‌గా రెండు మ్యాచుల్లోనూ కోల్‌క‌తానే విజ‌యం సాధించింది.

IPL 2024 : ఐపీఎల్ ముగింపు వేడుక‌లు.. ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ క‌చేరీ..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్, షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, ఝటావేద్ సుబ్రమణ్యన్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూకీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్.

ట్రెండింగ్ వార్తలు