Spidar Man : 36 కోట్లతో గర్ల్‌ఫ్రెండ్ కోసం ఖరీదైన ఇల్లు కొన్న స్పైడర్ మ్యాన్

ఇటీవల 'స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌' సినిమా ప్రపంచమంతటా భారీ విజయం సాధించింది. ఇందులో స్పైడర్ మ్యాన్ గా నటించిన టామ్‌ హాలండ్‌, హీరోయిన్ జెండయా ఇప్పటికే టాలీవుడ్ స్టార్లు కాగా.....

Spidar Man :  ఇటీవల ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ సినిమా ప్రపంచమంతటా భారీ విజయం సాధించింది. ఇందులో స్పైడర్ మ్యాన్ గా నటించిన టామ్‌ హాలండ్‌, హీరోయిన్ జెండయా ఇప్పటికే టాలీవుడ్ స్టార్లు కాగా ఈ సినిమా వీరిద్దరికి మరింత బూస్టప్ ఇచ్చింది. వీరిద్దరూ నటించిన ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

టామ్‌, జెండయా 2016లో ‘స్పైడర్‌ మ్యాన్‌: హోమ్‌ కమింగ్‌’ సినిమా సెట్స్‌లో మొదటి సారి కలుసుకున్నారు. ఈ సినిమా టైంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డారు. ఆ తర్వాత లవ్‌బర్డ్స్‌ లాగా కలిసే తిరిగేవారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా హాలీవుడ్ అంతా వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారన్న సంగతి తెలుసు. ఇక వీళ్ళ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

Anupama Parameswaran : బేబీ బంప్‌తో అనుపమ.. షాక్‌లో ఫ్యాన్స్

టామ్‌కు యూకేలో ప్రస్తుతం సొంత ఫ్లాట్ ఉంది. జెండయాకు లాస్‌ ఏంజిల్స్‌లో సొంత ఇల్లు ఉంది. జెండయా షూటింగ్స్ నిమిత్తం, లేదా వేరే ఏదైనా పనుల మీద యూకేకి వచ్చినప్పుడు టామ్ తో కలిసి ఉండటానికి టామ్ తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. వీరిద్దరూ కలిసి ఉండటానికి యూకేలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దీని విలువ భారత కరెన్సీ ప్రకారం దాదాపు 36 కోట్ల రూపాయలు అని సమాచారం. మొత్తానికి స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్ వీళ్ళిద్దర్నీ కలపడమే కాక బాగా సెటిల్ అయ్యేలా చేస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు