Bittiri Satti : హీరోలందరికీ అతనే కావాలి.. ఒక్కో ఇంటర్వ్యూకి లక్షల్లో రెమ్యునరేషన్..

ఇటీవల సుమకి కాంపిటేషన్ గా బిత్తిరి సత్తి వచ్చాడు. సుమ డేట్స్ లేకపోయినా, ఉన్నా బిత్తిరి సత్తితోటి కచ్చితంగా ఓ ఇంటర్వ్యూని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్స్. స్టార్ హీరోలందర్నీ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు................

Bittiri Satti :  సినిమాలు ఇటీవల ప్రమోషన్స్ ని రోజు రోజుకి పెంచేస్తున్నాయి. ఎన్ని వీలయితే అన్ని ఇంటర్వ్యూలు, అన్ని ప్రెస్ మీట్స్, ఫ్యాన్స్, యూట్యూబర్స్ తో చిట్ చాట్స్.. ఇలా రకరకాలుగా ప్రమోషన్స్ జోరు పెంచుతున్నారు. ఇక సినిమా రిలీజ్ కి ముందు స్పెషల్ ఇంటర్వ్యూలు కొన్ని చేసి రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా ఈ స్పెషల్ ఇంటర్వ్యూలు అన్ని యాంకర్ సుమనే చేస్తుంది. సుమకి డేట్స్ ఖాళీ లేని సమయంలో తప్పదు అనుకుంటే వేరే వాళ్ళతో చేయిస్తారు చిత్ర యూనిట్స్.

కానీ ఇటీవల సుమకి కాంపిటేషన్ గా బిత్తిరి సత్తి వచ్చాడు. సుమ డేట్స్ లేకపోయినా, ఉన్నా బిత్తిరి సత్తితోటి కచ్చితంగా ఓ ఇంటర్వ్యూని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్స్. స్టార్ హీరోలందర్నీ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట, పక్కా కమర్షియల్, RRR, F3, అంటే సుందరానికి, ది వారియర్, జయమ్మ పంచాయితీ.. ఇలా స్టార్ హీరోల అన్ని సినిమాలకి హీరోలని, చిత్ర యూనిట్ ని ఇంటర్వ్యూ చేసాడు బిత్తిరి సత్తి. ఈ ఇంటర్వ్యూలు అన్ని బాగా పాపులర్ అవ్వడంతో వీటికి బాగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో మిగిలిన హీరోలు, సినిమా వాళ్ళు కూడా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ ప్లాన్ చేయిస్తున్నారు.

Ranveer Deepika : షారుఖ్, సల్మాన్ ఇంటి పక్కనే.. 119 కోట్లతో నాలుగు అంతస్థులని కొన్న రణవీర్ దీపికా..

బిత్తిరి సత్తి న్యూస్ ఛానల్స్ నుంచి యూట్యూబ్, సినిమాలకి ఎదిగాడు. తన డిఫరెంట్ లాంగ్వేజ్ స్టైల్ తో అందర్నీ నవ్విస్తున్నాడు. సినిమాల్లో ఛాన్సులు కూడా ఇటీవల ఎక్కువగానే సాధిస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలు సక్సెస్ అయిన దగ్గర్నుంచి రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు బిత్తిరి సత్తి. స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్ ఇంటర్వ్యూలకి ఒక్కో ఇంటర్వ్యూకి దాదాపు రెండు లక్షల వరకు తీసుకుంటున్నాడట. దీంతో సినిమా వాళ్లంతా రెమ్యునరేషన్ ఎక్కువైనా పర్లేదు ఇతనే కావాలి అనడంతో బిత్తిరి సత్తి కూడా బాగానే సంపాదిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు