Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

టైమ్ చూసుకుని సినిమాలు రిలీజ్ చేద్దామంటే ధియేటర్లు ఖాళీ లేవు. సరే అని వెయిట్ చేద్దామంటే సీజన్ అయిపోతోంది. అందుకే ఇప్పటి వరకూ కాస్త రిలాక్స్ డ్ గా ఉన్న సినిమాలు సమయం లేదు మిత్రమా..

Telugu Films Releases: టైమ్ చూసుకుని సినిమాలు రిలీజ్ చేద్దామంటే ధియేటర్లు ఖాళీ లేవు. సరే అని వెయిట్ చేద్దామంటే సీజన్ అయిపోతోంది. అందుకే ఇప్పటి వరకూ కాస్త రిలాక్స్ డ్ గా ఉన్న సినిమాలు సమయం లేదు మిత్రమా అనుకుంటూ డిసెంబర్ మీద దాడి చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. 2021 లాస్ట్ క్వార్టర్ కూడా స్పీడ్ గా అయిపోతోంది. ఆల్రెడీ దసరా సీజన్ కూడా పెద్ద సినిమాలు ఏం రిలీజ్ కాకుండానే అయిపోయింది. సరే దీపావళికి రిలీజ్ చేద్దామంటే ఆల్రెడీ దీపావళి బరిలో అటు రజనీకాంత్, ఇటు బాలయ్య ముందే ఖర్చీఫ్ వేసేసుకున్నారు.

Telugu New Films: కొత్త సినిమాల అనౌన్స్.. దసరా సర్‌ప్రైజ్‌లతో ఉక్కిరిబిక్కిరి!

పోనీలే అని సంక్రాంతి వైపు చూద్దామంటే.. స్టార్ హీరోలే సర్దుబాటు చేస్కోలేనన్ని సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయింది సంక్రాంతి. అందుకే మిగిలున్న డిసెంబర్ మీదే దండయాత్ర చేస్తున్నారు హీరోలు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన నాని శ్యామ్ సింగరాయ్ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నానంటూ అనౌన్స్ చేశాడు నాని. రాహుల్ సంస్కృత్యన్ డైరెక్షన్లో వాసు క్యారెక్టర్ చేస్తున్న నాని డిసెంబర్ మీద డిపెండ్ అయ్యారు.

Big Boss 5: అడిగి మరీ ప్రపోజ్ చేయించుకున్న పింకీ.. అలకబూనిన సిరి

ఆల్రెడీ డిసెంబర్ లో బన్నీ పుష్ప, అఖిల్ ఏజెంట్ సినిమాలు ఉన్నాయి. ఈ పెద్ద సినిమాలకు ఎదురెళ్లకుండా గ్యాప్ చూసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు నాగశౌర్య. లక్ష్య మూవీని నవంబర్ బరిలోకి దింపిన నాగశౌర్య, వరుడుకావలెను సినిమాని డిసెంబర్ లో ఎయిమ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల డైరెక్షన్లో తెరకెక్కిన విరాట పర్వం కూడా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక వెయిట్ చేసే ఛాన్స్ లేక.. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది టీమ్. ఇప్పటికే దీపావళికి వస్తాడనుకున్న వరుణ్ తేజ్.. తన సినిమా గనిని డిసెంబర్ బరిలోనే దింపుతున్నాడు. ఇలా ఏ సినిమానైనా మిగిలున్న డిసెంబర్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తూ.. త్వరగా డేట్స్ లాక్ చేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు