Unemployement Rate: ఇండియాలో నిరుద్యోగ రేటు తెలంగాణలోనే అత్యల్పం

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోని నిరుద్యోగ రేటుపై డేటా వెల్లడించింది. అందులో వివరాల ప్రకారం తెలంగాణలో అత్యల్పంగా అంటే 0.7శాతం మాత్రమే నమోదుకావడం.

Unemployement Rate: సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోని నిరుద్యోగ రేటుపై డేటా వెల్లడించింది. అందులో వివరాల ప్రకారం తెలంగాణలో అత్యల్పంగా అంటే 0.7శాతం మాత్రమే నమోదుకావడం విశేషం.

ఇదిలా ఉంటే అత్యధికంగా హర్యానాలో నిరుద్యోగ శాతం ఎక్కువగా కనిపిస్తుంది. 23.4శాతంతో టాప్ లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ 18.9శాతం, త్రిపుర 17.1శాతం నమోదయ్యాయి.

ఇక నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ తర్వాత గుజరాత్ 1.2శాతంతో, మేఘాలయ 1.5శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

జనవరి 2022 వరకూ నమోదైన డేటా ప్రకారం.. రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటు ఇలా ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ 6.2 శాతం
అస్సాం 8.5 శాతం
బీహార్ 13.3 శాతం
ఛత్తీస్‌ఘడ్ 3.0 శాతం
ఢిల్లీ 14.1 శాతం
గోవా 11.6 శాతం
గుజరాత్ 1.2 శాతం
హర్యానా 23.4 శాతం
హిమాచల్ ప్రదేశ్ 13.9 శాతం
జమ్మూ & కశ్మీర్ 15.0 శాతం
జార్ఖండ్ 8.9 శాతం
కర్ణాటక 2.9 శాతం
కేరళ 5.0 శాతం
మధ్య ప్రదేశ్ 3.2 శాతం
మహారాష్ట్ర 4.2 శాతం
మేఘాలయ 1.5 శాతం
ఒడిశా 1.8 శాతం
పుదుచ్చేరి 7.8 శాతం
పంజాబ్ 9.0 శాతం
రాజస్థాన్ 18.9 శాతం
తమిళనాడు 5.3 శాతం
తెలంగాణ 0.7 శాతం
త్రిపుర 17.1 శాతం
ఉత్తరప్రదేశ్ 3.0 శాతం
ఉత్తరాఖాండ్ 3.5 శాతం
పశ్చిమ బెంగాల్ 6.4 శాతం

ట్రెండింగ్ వార్తలు