Bholaa Shankar : మెహర్ రమేష్‌తో సినిమా తీయమని చిరంజీవికి ఆ దర్శకుడు సలహా ఇచ్చాడట.. ఎవరో తెలుసా..?

చిరంజీవిని మెహర్ రమేష్‌తో సినిమా చేయమని ఆ స్టార్ దర్శకుడు సజస్ట్ చేశాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఈ సినిమా విషయంలో మెగా అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. దానికి కారణం ఈ చిత్రానికి డైరెక్టర్ మెహర్ రమేష్ కావడమే. ఈ దర్శకుడు తెలుగులో ఇప్పటివరకు నాలుగు సినిమాలు డైరెక్ట్ చేయగా.. ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయాయి. అసలు మెహర్ నుంచి ఒక సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయ్యింది.

Pawan Kalyan Fans : త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. గురూజీ కోసం రంగంలోకి దిగిన థమన్..

ప్రస్తుతం అసలు ఫేమ్ లోనే లేని మెహర్ తో చిరంజీవి సినిమా తీయడం.. అభిమానులను కలవర పెడుతుంది. చిరు రీసెంట్ గా వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు భోళాతో ప్లాప్ ఎదురైతే బాగోదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే చిరంజీవికి మెహర్ తో సినిమా తీయమని ఒక స్టార్ డైరెక్టర్ సజస్ట్ చేశాడట. ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు.. ఆ సలహా ఇచ్చిన డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వి వి వినాయక్.

Indrani Davuluri : గ్లోబల్ అవార్డ్స్ అందుకున్న నృత్యకారిణి ఇంద్రాణి దావులూరి గురించి మీకు తెలుసా..?

చిరంజీవి సైరా సినిమా చేస్తున్నప్పుడు వినాయక్.. “అన్నయ్య నువ్వు మాతో సినిమాలు చేయడం కాదు, మెహర్ మూవీ చేయాలి” అని చెప్పాడట. ఈ విషయాన్ని భోళా శంకర్ ప్రమోషన్స్ లో మెహర్ రమేష్ స్వయంగా వెల్లడించాడు. దీంతో వినాయక్ పై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మెహర్ రమేష్.. తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసి చిరుకి హిట్టుని అందిస్తాడా? లేదా? చూడాలి. కాగా భోళా శంకర్ ఈ నెల 11న రిలీజ్ కాబోతుంది. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు