Heavy Rains : ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. ఆ 12 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

Heavy Rains : ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో వాన కురవడం 20ఏళ్లలో ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం బీభ్సతం సృష్టించింది.

Heavy Rains (Photo : Google)

North India Heavy Rains : ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలను వానలు ముంచెత్తాయి. దీంతో రహదారులు జలమయ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు పోటెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో కుండపోత వానలు కురుస్తున్నాయి. 126 మి.మీ వర్షం పాతం నమోదైంది. దేశ రాజధానిలో ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో వాన కురవడం 20ఏళ్లలో ఇదే తొలిసారి. 2003లో జూలై 10న 133 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 2013 జూలై 21న 124 మి.మీ వర్షం కురిసింది. హస్తినకు వాతావరణ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎన్సీఆర్-ఢిల్లీ ప్రాంతంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీ, నోయిడా, గుర్ గావ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఉత్తరాఖండ్ తెహ్రి జిల్లాలో ప్రమాదం జరిగింది. వాహనం అదుపు తప్పి లోయలో పడింది. వాహనంలో ఉన్న 1మందిలో ఐదుగురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన రవిరావు, ఆయన భార్య కల్యాణి రుషికేశ్ ఆసుపత్రిలో ఉన్నారు. బండరాయిని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.(Heavy Rains)

Also Read..Uttarakhand Road Accident : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిపోయిన వాహనం, డ్రైవర్ సహా ఆరుగురు గల్లంతు

ఇక హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షం బీభ్సతం సృష్టించింది. రైల్వే ట్రాక్ పైకి నీరు చేరింది. అక్కడక్కడ చెట్లు విరిగిపడ్డాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కులు దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. వ్యాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజస్తాన్, హర్యానా, జమ్ము కశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లోనూ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. హిమాచల్ లో ప్రదేశ్ లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మనాలి-లేహ్ రహదారిని మూసివేశారు.

రాజస్తాన్ లో వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు. కర్నాటక, కేరళలోనూ భారీ వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జమ్ము కశ్మీర్ లో అమర్నాథ్ యాత్రను ఇవాళ మూడోరోజు నిలిపివేశారు. కొండచరియలు విరిగిపడటంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (Heavy Rains)

Also Read..Delhi Rain : ఢిల్లీలో కుండపోత వర్షాలు.. 40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం

హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు, వరద పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేశారు హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు. రానున్న 24 గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు నదులు, నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారాయన. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు సీఎం సుఖ్విందర్.

భారీ వర్షాల నేపథ్యంలో 12 రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హర్యానా, జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ.. ఢిల్లీలో రాబోయే 24 గంటలపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు పడతాయంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో రానున్న 24 గంటల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2 రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ జమ్మ కశ్మీర్ కు హెచ్చరికలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, తూర్పు రాజస్థాన్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు