WhatsApp New Features : వాట్సాప్‌లో 2GB వరకు ఫైల్స్ పంపొచ్చు.. గ్రూపులో ఎంతమంది చేరవచ్చంటే?

WhatsApp New Features : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

WhatsApp New Features : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. లేటెస్టుగా వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఎప్పటినుంచో వాట్సాప్ iMessage-వంటి ఎమోజి రియాక్షన్‌లపై వర్క్ చేస్తోంది. ఇప్పుడు WhatsApp ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఎమోజి రియాక్షన్‌లతో పాటు, వాట్సాప్ యూజర్లు మెసేజింగ్ యాప్‌లో 2GB వరకు ఫైల్‌లను పంపుకోవచ్చు. అలాగే.. వాట్సాప్ గ్రూప్‌లో గరిష్టంగా 512 మంది యాడ్ చేసేందుకు కూడా వాట్సాప్ యూజర్లను అనుమతిస్తుంది.

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మొదట్లో ఫేస్‌బుక్ మాదిరిగానే వాట్సాప్‌లోనూ ఎమోజీ రియాక్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. వాట్సాప్ పోటీదారులైన సిగ్నల్, టెలిగ్రామ్, imessages ప్లాట్ ఫారమ్‌ల్లో ఎమోజి రియాక్షన్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి.. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వాట్సాప్ చాలా కాలంగా ఈ ఎమోజీ ఫీచర్లపై వర్క్ చేస్తోంది. బీటా టెస్టింగ్ సమయంలో టెస్టర్లు వాట్సాప్‌లో ఎమోజీ ఫీచర్‌ను గుర్తించారు. మెసేజింగ్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. యాప్ లేటెస్ట్ వెర్షన్‌లో ఎమోజీ రియాక్షన్లు అందుబాటులో ఉన్నాయని WhatsApp బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Whatsapp Finally Rolls Out Ability To Transfer Files Up To 2gb, Emoji Reactions And Other Features 

2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు :
వాట్సాప్‌లో ఒకేసారి 2GB సైజులో ఉన్న ఫైల్‌లను పంపుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ ఫైల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ కలిగి ఉంటాయి. గతంలో వాట్సాప్ సెటప్ యూజర్లకు ఒకసారి 100MBని మాత్రమే ట్రాన్స్ ఫర్ చేయడానికి అనుమతించేది. రానురాను యూజర్లకు వీడియోలు, ఫొటోలను అధికంగా వినియోగిస్తుండటంతో వీడియోలు, ఫైల్‌లను వాట్సాప్ ప్లాట్ ఫారంపై ట్రాన్స్ ఫర్ చేయడం కష్టంగా మారింది. ఇప్పుడా ఆ సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ యూజర్లను 2GB ఫైల్‌‌ను పంపుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే Wi-Fi నెట్ వర్క్ ద్వారా 2GB ఫైళ్లను సులభంగా పంపుకోవచ్చునని పేర్కొంది. అయితే 2GB సైజు ఫైల్స్ ట్రాన్స్ ఫర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో యూజర్లకు తెలియజేసేందుకు అప్‌లోడ్ చేసే సమయంలో లేదా డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడే పాప్ అప్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుందని బ్లాగ్‌లో పేర్కొంది.

గ్రూపులో గరిష్టంగా 512 మంది జాయిన్ కావొచ్చు :
వాట్సాప్ బ్లాగ్ పోస్ట్‌ ప్రకారం.. వాట్సాప్‌లో ఒక గ్రూప్‌లో 512 మంది వరకు యూజజర్లు చేరవచ్చు. మెసేజింగ్ యాప్ ప్రస్తుతం ఒక గ్రూప్‌కి 256 మంది వ్యక్తులను మాత్రమే యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఆలస్యంగా రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ప్రైవేట్, సురక్షితమైన కమ్యూనిటీలను నిర్మించడమే లక్ష్యంగా వాట్సాప్ పని చేస్తోంది.

Read Also : How To Avoid WhatsappBan : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఇలా చేస్తే, వాట్సాప్ వాడలేరు..!

ట్రెండింగ్ వార్తలు