Zomato IPO: జొమాటోలో 35రెట్లు ఎక్కువ పెట్టుబడులకు రెడీగా యాంకర్ ఇన్వెస్టర్లు

జొమాటో ఐపీఓ, ఇటీవలి కాలంలో మోస్ట్ పాపులర్ ఐపీఓగా మారిపోయింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 35రెట్లు ఎక్కువగా నిధులు వచ్చిపడుతున్నాయి. గుర్ గావ్ కు చెందిన జొమాటోకు బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి.

Zomato IPO: జొమాటో ఐపీఓ, ఇటీవలి కాలంలో మోస్ట్ పాపులర్ ఐపీఓగా మారిపోయింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 35రెట్లు ఎక్కువగా నిధులు వచ్చిపడుతున్నాయి. గుర్ గావ్ కు చెందిన జొమాటోకు బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. 186మంది యాంకర్ ఇన్వెస్టర్లకు 552మిలియన్ షేర్లను కేటాయించింది జొమాటో.

ఈ యాంకర్ ఇన్వెస్టర్లలో బ్లాక్‌రాక్, టైగర్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, ఫిడిలిటీ, న్యూ వరల్డ్ ఫండ్ ఇంక్, జెపి మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగపూర్) పిటి-వన్డే, గోల్డ్‌మన్ సాచ్స్ (సింగపూర్) పిటి -ఓడి, టి రో, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు, సింగపూర్ ప్రభుత్వం, ద్రవ్య అథారిటీ ఆఫ్ సింగపూర్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలు ఉన్నారు.

దేశీ ఇన్వెస్టర్లుగా యాంకర్ బిడ్డింగ్ కు పాల్గొని స్థానం దక్కించుకున్న వారిలో కోటక్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, ఎస్బిఐ ఎంఎఫ్, యుటిఐ ఎంఎఫ్, హెచ్‌డిఎఫ్‌సి ఎంఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, ఐడిఎఫ్‌సి ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, ఎడెల్‌వైస్ ఎంఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం.

యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్ ను రూ.72 నుంచి రూ.76మధ్యలో అమ్ముతారు. 1.4బిలియన్ డాలర్ల షేర్ తో మార్చి 2020న స్టార్టప్ గా వచ్చిన ఎస్బీఐ కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ తర్వాత 1.3బిలియన్ డాలర్ల స్టార్టప్ ఐపీఓ జొమాటోదే. జొమాటో ఐపీఓను కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, క్రెడిట్ సూయీస్ గ్రూప్ ఏజీ, బోఫా సెక్యూరిటీస్ అండ్ సిటీ గ్రూప్ ఇంక్ లు కలిసి మేనేజ్ చేస్తారు.

కొద్ది సంవత్సరాలుగా ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రత్యేకతను దక్కించుకుని మెరుగైన వృద్ధి కనబరిచాయి.

ట్రెండింగ్ వార్తలు