Bloating : వేసవిలో కడుపు ఉబ్బరాన్ని నివారించే పానీయం ఇదే !

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, హార్మోన్ అసమతుల్యత లేదా మలబద్ధకంతో బాధపడే వారు ఏ సీజన్‌లోనైనా ఈ యాంటీ-బ్లోటింగ్ డ్రింక్ తాగవచ్చు. పుదీనా జలుబు, దగ్గు, ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, డిటాక్స్, మొటిమలు, సైనసైటిస్, మలబద్ధకం, మరిన్నింటికి సహాయపడుతుంది.

Bloating : వేసవి కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలు ముఖ్యమైనవి. ఇది అసౌకర్యం మరియు బద్ధకాన్ని కలిగిస్తుంది. వేడి వాతావరణంలో, శరీరం వేడిని నియంత్రించడానికి ఎక్కువ చెమటలు పడతాయి. ఈ పరిస్ధితి శరీరంలో నీటి లోపం, నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఈ పరిస్ధితి తలెతత్తకుండా ఉండాలంటే తగినంత మోతాదులో ద్రవాలను తీసుకోవాలి. ద్రవాలు ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం కలుగుతుంది.

జీర్ణవ్యవస్థ వేసవిలో అధిక కేలరీలు, లవణం . చక్కెర కలిగిన ఆహారాలు అసహనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఉబ్బరాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఇప్పటికే వేసవి ఎండలు రోజురోజుకు పెరుగుతున్నందన జీర్ణ వ్యవస్ధను ట్రాక్ లో ఉంచే చర్యలను అనుసరించటం చాలా అవసరం. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, ఆయుర్వేద నిపుణులు ఉదయం పుదీనా, జీరా పానీయాన్ని సిఫార్సు చేస్తున్నారు. దీనిని తయారుచేయడం సులభం. అంతేకాకుండా మంచి రుచికూడా ఉంటుంది.

READ ALSO : జీర్ణక్రియను మెరుగుపర్చడం ఎలా? ఇందుకోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే?

పుదీనా, జీరా పానీయం తయారీ ;

ఒక గ్లాసు నీటిలో 5-7 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ జీలకర్ర , అర టీస్పూన్ వాము గింజలు వేసి, మీడియం వేడి మీద మూడు నిమిషాలు ఉడకబెట్టి, దానిని వడకట్టి, గోరువెచ్చగా తీసుకోవాలని నిపుణులు దీన్ని ఉదయం పూట, భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత, లేకుంటే ఉబ్బరం, బరువుగా అనిపించినప్పుడు తాగాలని సూచిస్తున్నారు.

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, హార్మోన్ అసమతుల్యత లేదా మలబద్ధకంతో బాధపడే వారు ఏ సీజన్‌లోనైనా ఈ యాంటీ-బ్లోటింగ్ డ్రింక్ తాగవచ్చు. పుదీనా జలుబు, దగ్గు, ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, డిటాక్స్, మొటిమలు, సైనసైటిస్, మలబద్ధకం, మరిన్నింటికి సహాయపడుతుంది. జీలకర్ర శక్తిలో వేడిగా ఉంటుంది, రుచిని మెరుగుపరుస్తుంది, జీర్ణ అగ్నిని ప్రేరేపిస్తుంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కఫా, వాతాన్ని తగ్గిస్తుంది. వాము ఉబ్బరానికి ఉత్తమమైన మసాలా, సులభంగా జీర్ణం అవుతుంది. కఫా , వాతాన్ని తగ్గిస్తుంది. భోజనం తర్వాత గ్యాస్, ఆమ్లతను తగ్గించడంలో సహాయపడుతుంది.

వేసవి ఉబ్బరాన్ని నివారించాలన్నా, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, తగినంత ద్రవాలను తీసుకోవడం, హెవీ క్యాలరీలు, లవణం, చక్కెర కలిగిన ఆహారాలను నివారించడం చాలా అవసరం.

READ ALSO : Okra Benefits : జీర్ణ వ్యవస్ధను మెరుగుపరచటంతోపాటు, రక్తంలో చక్కెర స్ధాయిలు నియంత్రణలో ఉంచే బెండకాయ!

ఈ యాంటీ-బ్లోటింగ్ డ్రింక్‌ని ఎవరు తీసుకోవచ్చు?

ఈ పానీయం అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, హార్మోన్ అసమతుల్యత లేదా మలబద్ధకంతో బాధపడే వారు ఏ సీజన్‌లోనైనా సేవించవచ్చు. ఈ పానీయాన్ని ముందుగా ఉదయం, భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. ఉబ్బరం, బరువుగా అనిపించినప్పుడు తాగవచ్చు.

ట్రెండింగ్ వార్తలు