National Film Awards : ఘనంగా 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా సూర్య, జ్యోతిక..

ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేశారు.........

National Film Awards :  ఇటీవల 2020 సంవత్సరానికి గాను 68 వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి తెలుగులో కలర్ ఫోటో సినిమాకి, నాట్యం సినిమాకి, అల వైకుంఠపురంలో సినిమాలకి నేషనల్ అవార్డులు వచ్చాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఈ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జి.ఆర్‌.గోపినాథ్‌ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చిత్ర నిర్మాత జ్యోతిక కావడంతో ఉత్తమ చిత్రం అవార్డు జ్యోతిక అందుకుంది. సూర్య, జ్యోతిక కపుల్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Ponniyin Selvan 1 Review : పొన్నియిన్ సెల్వన్ 1 రివ్యూ.. పక్కా తమిళ సినిమా..కొత్త సీసాలో పాత సాంబార్..

ఇక సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకవంలో తెరకెక్కిన ‘కలర్‌ ఫొటో’ సినిమా తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలవడంతో ఈ అవార్డును నిర్మాత రాజేష్, దర్శకుడు సందీప్ రాజ్ అందుకున్నారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు ‘నాట్యం’ సినిమాకి గాను సంధ్యా రాజ్ అందుకుంది. ఉత్తమ మేకప్‌ విభాగం కూడా నాట్యం సినిమాకే అవార్డు వరించింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ అవార్డు అందుకున్నారు.

 

మిగిలిన అన్ని విభాగాల్లోని అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీరికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు