Brahmastra: బాయ్‌కాట్ ట్రెండ్‌పై రణ్‌బీర్ వ్యాఖ్యలు.. షంషీరా ఫెయిల్యూర్‌కి అదే కారణమట!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్, అలియా జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదలవుతుంది. తాజాగా బాయ్‌కాట్ ట్రెండ్ పై ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్ స్పదింస్తూ..

Brahmastra: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్, అలియా జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదలవుతుంది. మొదటి భాగం “బ్రహ్మాస్త్ర-శివ” ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంకాగా గత కొంతకలంగా బాలీవుడ్ కి గడ్డు కాలం నడుస్తుండడంతో ఈ మూవీతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని మూవీ టీం ప్రమోషన్స్ తో సినిమాని ప్రేక్షకుల దగ్గరకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది.

Brahmastra: ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’ నుంచి ‘రికార్డుల బ్రహ్మాస్త్ర’కు.. విషయమేంటి?

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాని నార్త్ లో రిలీజ్ చేస్తుండగా సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. కాగా సినిమా కథాంశం మొత్తం భారతీయ హిందూ ఇతిహాసాల్లో ఉన్న అస్త్రాలు చుట్టూ తిరుగుతుందని మూవీ మేకర్స్ ఇప్పటికే పలు ప్రచార చిత్రాలతో చెప్పుకొచ్చింది. సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలు చేస్తుండగా నాగిని ఫేమ్ నటి మౌనిరాయ్ విలన్ గా నటిస్తుంది.

అసలు విషయానికి వస్తే బాయ్‌కాట్ ట్రెండ్ పై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్ స్పదింస్తూ.. “సినిమాలో కంటెంట్ లేకపోవడంతోనే ప్రేక్షకులు థియేటర్ లకు రావడం లేదు. ఇటీవల విడుదలైన నా షంషీరా మూవీపై ఎటువంటి వ్యతిరేకత లేదు అయినా సినిమా ఆడలేదు. కారణం సినిమాలో కంటెంట్ లేకపోవడమే, అంతేగాని మరే కారణం లేదు”. అంటూ మీడియా విలేకర్లతో వెల్లడించారు. బాయ్‌కాట్ పై ఇలా పాజిటివ్ గా స్పదించి ప్రేక్షకులని థియేటర్ కి రంపించే ప్రయతనం చేస్తున్నారు. ఇక చూడాలి ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో.

ట్రెండింగ్ వార్తలు