Brahmastra: ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’ నుంచి ‘రికార్డుల బ్రహ్మాస్త్ర’కు.. విషయమేంటి?

బాలీవుడ్ లో బాయ్‌కాట్ వివాదాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బాలీవుడ్ లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుండడంతో ప్రేక్షకులు థియేటర్ కి రాని పరిస్థితి ఏర్పడింది. దింతో ఈ సినిమాకు అసలు ప్రేక్షకుడు వస్తాడా అన్న ప్రశ్నలకు బదులిస్తూ ప్రముఖ సినిమా థియేటర్స్ కంపెనీ "పివిఆర్ సినిమాస్" ఒక పోస్ట్ చేసింది.

Brahmastra: బాలీవుడ్ లో బాయ్‌కాట్ వివాదాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖ‌ర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటిభాగం “శివ” ఈ నెల 9న విడుదలకు సిద్ధం కాగా మూవీ టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా సౌత్ లోను పలు టెలివిజన్ కార్యక్రమాలకు మూవీ టీం రాజమౌళితో హాజరు అవుతున్నారు.

Brahmastra Pre Release Event : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా??

సౌత్ లో దర్శకదీరుడు ఈ సినిమాని సమర్పిస్తుండడంతో, మూవీ ప్రచార బాధ్యతలు తన భుజాలపై వేసుకుని భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో కూడా విడుదలకు సిద్ధం చేశారు. తెలుగులో ఈ సినిమా “బ్రహ్మాస్త్రం”గా రానుంది. బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్‌బీర్ సింగ్‌, అలియాభ‌ట్ ప్రధాన పాత్ర‌ల్లో నటిస్తుండగా బిగ్‌బీ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సీరియల్ నటి మౌనీరాయ్ విల‌న్ పాత్ర‌లో కనిపిస్తుంది.

అయితే ఇటీవల బాలీవుడ్ లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తుండడంతో ప్రేక్షకులు థియేటర్ కి రాని పరిస్థితి ఏర్పడింది. దింతో ఈ సినిమాకు అసలు ప్రేక్షకుడు వస్తాడా అన్న ప్రశ్నలకు బదులిస్తూ ప్రముఖ సినిమా థియేటర్స్ కంపెనీ “పివిఆర్ సినిమాస్” ఒక పోస్ట్ చేసింది. ఒక్క పివీఆర్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే ఈ చిత్రం 1ల‌క్ష టిక్కెట్లు అమ్ముడు పోయినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇక సౌత్ లోనూ ప్రీ బుకింగ్స్ బాగానే జ‌రుగుతున్నాయట‌. ఈ మధ్యకాలంలో ఏ హిందీ సినిమాకి ఈ రేంజ్ బుకింగ్స్ జరగకపోవడంతో చిత్ర యూనిట్ ఆనందపడుతోంది.

ట్రెండింగ్ వార్తలు