Dhurandhar: నిజం చూపడం నేరమా? అసలు దురంధర్‌లో ఏముంది.. గల్ఫ్ దేశాల్లో బ్యాన్ ఎందుకు..
ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అక్కడ బ్యాన్ కావడం చిత్ర నిర్మాతలకు పెద్ద షాకే అయినా.. మన దేశంలోని కలెక్షన్స్ ఊరటనిచ్చాయ్.
Dhurandhar: రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. విడుదలైన వారంలోపే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాను బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో నిషేధించినట్లు సమాచారం. పాకిస్థాన్‌ను ప్రతికూలంగా చూపించడమే దీనికి కారణమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గల్ఫ్‌లో బ్యాన్ అయినా, భారత్‌లో మాత్రం ‘ధురంధర్’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది.
హిందీ చిత్రసీమలో ఈ మధ్య విజయాల దాహాన్ని తీర్చిన సినిమా దురంధర్.. స్పై మూవీస్ కొత్త కాకపోయినా అసలు అంచనాలే లేని ఈ సినిమా రోజురోజుకీ ప్రజాదరణ పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఈ సినిమా పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా తీశారంటూ గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేశారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఎఈ లో ప్రదర్శించలేదు. హిందీ సినిమా మార్కెట్‌లో గల్ఫ్ దేశాలది పెద్ద వాటానే. కేవలం పాకిస్తాన్ రాజకీయాలను ఇందులో చూపించారనే సాకుతోనే గల్భ్ దేశాల సెన్సార్ బోర్డులు మన సినిమాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమేట్, ఆర్టికల్ 370, కశ్మీర్ ఫైల్స్ కూడా ఇలానే ఇక్కడ రిలీజ్ కాలేదు.
యురి వంటి హిట్ సినిమా తర్వాత ఆదిత్య ధర్ ఈ సినిమా డైరక్ట్ చేయగా ప్రొడ్యూసర్ కూడా ఆయనే. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలుగా కన్పించే ఈ సినిమాలో ఓ ఇండియన్ స్పై కరాచీకి వెళ్లి అక్కడి యాంటీ ఇండియన్ గ్యాంగ్స్‌ని ఎలా తుద ముట్టించాడనేదే ఈ కథాంశం.. ఈ కథలో భాగంగా హమ్జా ఆలీ మజ్హరీ క్యారెక్టర్ ఎలా రెహమత్ బలోచ్‌కి దగ్గరవుతుంది.. అలానే పాకిస్థాన్ లోని రాజకీయ నాయకులు భారత్ పై ఉగ్రవాద దాడులకు ఎలా నిధులు..ఆయుధాలు సమకూర్చేదీ చూపించారు.
పాకిస్తాన్ లీడర్ల పైశాచిక ఆనందం..
ముఖ్యంగా ముంబై తాజ్ హోటల్‌పై దాడి సమయంలో పాక్‌లోని పొలిటికల్ లీడర్లు ఎలా పైశాచికానందం పొందిందీ చిత్రీకరించారు. ఆ సమయంలో టీవీలో మన భద్రతా దళాల ఆపరేషన్లను చూస్తూ.. అక్కడి టెర్రరిస్టులకు ఎలా సూచనలు ఇచ్చేదీ కూడా కన్పిస్తుంది.. ఇదంతా కూడా పాక్‌కి సన్నిహిత ముస్లిం దేశాలకు నచ్చలేదంటారు. అందుకే ఈ బ్యాన్ విధించారనేది చెప్తున్నారు.
దురంధర్ కథలో ల్యారీని గెలువ్.. కరాచీని ఏలవచ్చు.. కరాచీని గెలిస్తే..మొత్తం జాతినే మార్చేయవచ్చు..అంటూ జమిల్ జమాలీ అనే క్యారెక్టర్ ఇందులో చెప్తుంది.. అందుకు తగినట్లుగానే సినిమా లైన్ అంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే రెహమత్ డకాయిట్ ఉరఫ్ రెహమత్ బలోచ్ గ్యాంగ్‌లో చొరబడి..అతని నమ్మకాన్ని చూరగొని..ఆ తర్వాత అందరినీ లేపేయడమే ఈ సినిమా స్టోరీ. యాభై ఏళ్ల వయసులో అక్షయ్ ఖన్నా రెహమత్ బలోచ్‌గా ఓ రకంగా జీవించేశాడని చెప్పాలి.
ఎప్పుడో త్రీ ఇడియట్స్, తాళ్ సినిమాలో సక్సెస్ సాధించిన అక్షయ్ ఖన్నా దాదాపు పాతికేళ్ల తర్వాత స్క్రీన్‌పై ఇరగదీశాడు. ఇక రణ్‌వీర్ సింగ్ దురంధర్‌గా అంచనాలను మించి రాణించాడని ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా గల్ఫ్‌లో బ్యాన్ కావడం చిత్ర నిర్మాతలకు పెద్ద షాకే అయినా.. మన దేశంలోని కలెక్షన్స్ ఊరటనిచ్చాయ్. విజయాల కరువులో ఉన్న బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
Also Read: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్
