Thaman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ అంటే తమన్(Thaman) అనే చెప్పాలి. ఆయన అందించే మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Thaman made shocking comments on Tollywood industry.
Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ అంటే తమన్(Thaman) అనే చెప్పాలి. ఆయన అందించే మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సినిమాకు ఆయన మ్యూజిక్ అందించాడు అంటే ఆ సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈయన అందించే బీజీఎమ్ కి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే, స్టార్ హీరోలు సైతం ఈయనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన మ్యూజిక్ చేసిన ఓజీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Malavika Mohanan: లాంగ్ స్కర్ట్ లో మాళవిక మెరుపులు అదరహో.. ఫోటోలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ యూనిటీ ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ..’అనిరుధ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు టాలీవుడ్ లో కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా అనిరుధ్ కావాలని అంటున్నారు. అయితే, అనిరుధ్ కి టాలీవుడ్ లో వస్తున్న ఆఫర్స్ నాకు తమిళ్ లో రావడం లేదు. వారికీ ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటుంది. మన సినిమాలకు మనవారే పని చేయాలనీ కోరుకుంటారు. కానీ, మనకు ఆ ఫీలింగ్ ఉండదు. ఆ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో యూనిటీ లేదు. అందుకే తెలుగు ఆడియన్స్ కి గడ్డు కాలం నడుస్తోంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
దీంతో తమన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి తమన్ చేసిన ఈ కామెంట్స్ పై టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. తమన్ మ్యూజిక్ అందించిన అఖండ 2 రీసెంట్ గా విడుదల అయ్యింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత కూడా పలు భారీ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు తమన్.
