Smitha: మల్లీశ్వరి సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. అందుకే సినిమాలు చేయడం మానేశా..

టాలీవుడ్ సింగర్ స్మిత(Smitha) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆమె తెలుగులో చాలా సినిమాల్లో పాటలు పాడారు. అయితే, అందరు వెళ్లే దారిలో వెళితే తన స్పెషాలిటీ ఏముంటుంది అని అనుకుందేమో.

Smitha: మల్లీశ్వరి సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. అందుకే సినిమాలు చేయడం మానేశా..

Singer Smitha made shocking comments about not doing movies.

Updated On : December 13, 2025 / 7:42 PM IST

Smitha: టాలీవుడ్ సింగర్ స్మిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆమె తెలుగులో చాలా సినిమాల్లో పాటలు పాడారు. అయితే, అందరు వెళ్లే దారిలో వెళితే తన స్పెషాలిటీ ఏముంటుంది అని అనుకుందేమో. ప్రైవేట్ ఆల్బమ్స్, పాత పాటలను రీమిక్స్ చేయడం మొదలుపెట్టింది. వాటిలో ఆమె చేసిన మసక మసక చీకటిలో అనే రీమిక్స్ పాట ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ సాంగ్ ను మరోసారి కొత్త వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది స్మిత(Smitha). ఈ సాంగ్ ను శనివారం ఒక ఈవెంట్ లో విడుదల చేసింది.

Dekh lenge Saala Song Out Now: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ డాన్స్ కేకో కేక..

ఆ సింగ్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడింది. అందులో ఒక రిపోర్టర్ ఆమె యాక్టింగ్ కెరీర్ గురించి ప్రస్తావించారు. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. నేను మల్లీశ్వరి సినిమాలో ఒక పాత్ర చేశాను. అది మిస్ ఫైర్ అయ్యింది. ఆ సినిమా విషయంలో నాకు చెప్పింది ఒకరి చివరికి తెరపై మరోకటి చూపించారు. అందుకే సినిమాలు చేయడం మానేశాను అంటూ చెప్పుకొచ్చింది స్మిత. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాలో స్మిత పనిమనిషి పాత్రలో కనిపించింది. అది కూడా రెండు, మూడు సన్నివేషాలలో మాత్రమే ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు అదే సినిమా గురించి చెప్పింది స్మిత.