Dekh lenge Saala Song Out Now: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ డాన్స్ కేకో కేక..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్ లేంగే సాలా(Dekh lenge Saala Song Out Now) అనే పాటను విడుదల చేశారు మేకర్స్.
ustaad bhagat singh Dekh Lena Saala song out now
Dekh lenge Saala Song Out Now; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాబోలో రాబోతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అది కూడా ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Thaman: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్
తాజాగా ఈ సినిమా నుంచి ‘దేఖ్ లేంగే సాలా(Dekh lenge Saala Song Out Now)’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. ఇందుకోసం రాజమండ్రిలో ప్రత్యేకమైన ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దేవి మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్న ఈ పాటను విశాల్ డడ్లాని పాడగా.. భాస్కరభట్ల రాశారు. ఇక పవన్ కళ్యాణ్ స్టైలీష్ స్టెప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వేసినవి చిన్న చిన్న స్టెప్స్ అయినా తన స్వాగ్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు పవన్ కళ్యాణ్. ఇక పవన్ పక్కన శ్రీలీల కూడా తన డాన్స్ తో మ్యాజిక్ చేసింది అనే చెప్పాలి. మరి లేట్ ఎందుకు మీరు కూడా వినేయండి.
