Kantara : కాంతార బడ్జెట్ ఏమో 20 కోట్లు.. ప్రీక్వెల్‌కి మాత్రం ఇంత హెవీ బడ్జెట్? కాంతార 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ప్రస్తుతం కాంతార సినిమా ప్రీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా కాంతార ప్రీక్వెల్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

Rishab Shetty Kantara Prequel Movie Budget Shoot and releasing date full details here

Kantara Prequel : కన్నడలో రిషబ్ శెట్టి(Rishab Shetty) హీరోగా సప్తమి గౌడ(Sapthami Gowda) హీరోయిన్ గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కాంతార. చిన్న సినిమాగా రిలీజయి కన్నడలో విజయం సాధించిన అనంతరం దేశమంతటా విడుదల అయి భారీ విజయం సాధించింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార(Kantara) సినిమా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాంతార సినిమాని ప్రేక్షకులతో పాటు అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు.

ఇక కాంతార సినిమా భారీ విజయం సాధించడంతో ప్రీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. రిషబ్ శెట్టి సినిమా గురించి మాట్లాడుతూ.. మీరు చూసింది కాంతార 2, త్వరలో కాంతార 1 తీస్తాను అని ప్రకటించాడు. అధికారికంగా ఈ సినిమా మొదలైంది కూడా. ప్రస్తుతం కాంతార సినిమా ప్రీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ఉందా? చిత్రయూనిట్ ఏం చెప్పారో చూడండి..

తాజాగా కాంతార ప్రీక్వెల్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. కాంతార సినిమా బడ్జెట్ కేవలం 20 కోట్లతో తెరకెక్కిస్తే కాంతార ప్రీక్వెల్ కి మాత్రం 125 కోట్లు బడ్జెట్ పెట్టి భారీగా నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందని, దసరా తర్వాత నవంబర్ నుంచి కాంతార ప్రీక్వెల్ షూట్ మొదలవ్వనుంది సమాచారం. అలాగే వచ్చే సంవత్సరం సమ్మర్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుందని కన్నడ ఇండస్ట్రీ సమాచారం. మరి ఈ సినిమా కాంతారని మించి హిట్ అవుతుందా, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు