Salman Khan : సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూశారా? గుండు బాస్.. షారుఖ్ లాగే సినిమా కోసమో?

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కొత్త లుక్ వైరల్ గా మారింది. నిన్న ముంబైలో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరైన సల్మాన్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ గుండుతో దర్శనమిచ్చాడు.

Salman Khan New look with Bald Head photos goes viral

Salman Khan : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో మరో పక్క మొన్నటిదాకా బిగ్ బాస్(BiggBoss) తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టైగర్ 3(Tiger 3) సినిమా చేస్తున్నాడు సల్మాన్. మనీష్ శర్మ దర్శకత్వంలో YRF స్పై యూనివర్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుండగా షారుఖ్ ఖాన్(Shahrukh Khan) గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం టైగర్ 3 సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ లో దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కొత్త లుక్ వైరల్ గా మారింది. నిన్న ముంబైలో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరైన సల్మాన్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ గుండుతో దర్శనమిచ్చాడు. గుండు బాస్‌లా స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతున్నాడు సల్మాన్.

Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు.. పోలీస్ డ్రెస్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వాక్..

ఇటీవలే బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ ముగియగా అందులో ఎప్పటిలానే అదరగొట్టిన సల్మాన్ ఆ తర్వాత గుండు చేయించుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ గుండుతో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. మరి సల్మాన్ ఎందుకు గుండు చేయించుకున్నాడో అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు, అభిమానులు. సల్మాన్ టైగర్ 3 సినిమా కోసం గుండు చేయించుకున్నాడా, షారుఖ్ జవాన్ లో గుండుతో కనిపించబోతున్నట్టు సల్మాన్ కూడా అలా ఏమన్నా ప్లాన్ చేశాడా అని ఆలోచిస్తున్నారు. లేదా సరదాగా చేయించుకున్నాడా అని ప్రశ్నిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు