Adipurush review : నిరాశ‌ప‌రిచింది.. భారీ గంద‌ర‌గోళాన్ని సృష్టించింది.. అంచ‌నాల‌ను అందుకోలేదు

ప్ర‌భాస్(Prabhas) రాముడిగా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌(Adipurush). బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ ఓం రౌత్(Om Raut) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది.

Taran Adarsh review

Adipurush : ప్ర‌భాస్(Prabhas) రాముడిగా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌(Adipurush). బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ ఓం రౌత్(Om Raut) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించ‌గా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టి సిరీస్, రెట్రోఫైల్స్ కలిసి రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మించాయి. ఈ సినిమా నేడు(జూన్ 16న‌) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించే ప్ర‌తి థియేట‌ర్‌లోనూ ఒక సీటును హ‌నుమంతుడి (Hanuman) కోసం కేటాయిస్తున్న‌ట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే చిత్ర బృందం తెలియ‌జేసింది.

రామాయ‌ణ క‌థాంశం కావ‌డం, ప్ర‌భాస్ రాముడిగా చేయ‌డం, హ‌నుమంతుడి కోసం సీటు కేటాయిస్తున్న‌ట్లు చెప్ప‌డంతో చిత్రంపై భారీ అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఇక ఈ చిత్రంపై ప్ర‌ముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌ను ఈ చిత్రం పెద్ద ఎత్తున నిరాశ‌ప‌రిచిందని చెప్పాడు. చాలా త‌క్కువ రేటింగ్ ఇచ్చాడు. “ఆదిపురుష్ అనేది ఒక నిరాశ‌జ‌న‌క‌మైన ఇతిహాసం. భారీ అంచ‌నాల‌ను ద‌ర్శ‌కుడు ఓంరౌత్ అందుకోలేక‌పోయాడు. డ్రీమ్ కాస్ట్‌, భారీ బ‌డ్డెట్‌తో భారీ గంద‌ర‌గోళాన్ని సృష్టించాడు.” అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

Adipurush : థియేటర్‍పై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి.. పగిలిన అద్దాలు!

అనుకోతి అతిథి..

ఆదిపురుష్ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించే ప్ర‌తి థియేట‌ర్‌లో ఒక సీటును హ‌నుమంతుడి కోసం కేటాయించాల‌ని చిత్ర బృందం నిర్ణ‌యం తీసుకుంది. రామాయ‌ణ పారాయ‌ణం జ‌రిగే ప్ర‌తి చోటుకి హ‌నుమంతుడు వ‌స్తాడు అనే న‌మ్మ‌కంతో ఇలా చేశారు. అయితే.. సినిమా ప్ర‌ద‌ర్శితమ‌వుతున్న ఓ థియేట‌ర్‌లో అనుకోకుండా ఓ కోతి ప్ర‌వేశించింది. దీంతో హాల్‌లోని ప్రేక్ష‌కులంతా జై శ్రీరామ్ నినాదాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన వారంతా హ‌నుమంతుడే వ‌చ్చి సినిమాను చూశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Adipurush : నేపాల్‌లో ఆదిపురుష్ వివాదం.. డైలాగ్ తీసేయాలంటూ నేపాల్ నేతలు.. అసలు ఏమైంది?

 

ట్రెండింగ్ వార్తలు