Indians Use Antibiotics: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న ఇండియన్స్.. టాప్‌లో అజిత్రోమైసిన్

భారతీయులు అవసరానికి మించి యాంటీబయాటిక్స్ వాడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా అజిత్రోమైసిన్ ఎక్కువగా తీసుకుంటున్నారట. ‘లాన్సెట్’ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Indians Use Antibiotics: భారతీయులు యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో వాడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా అజిత్రోమైసిన్ అన్నింటికంటే ఎక్కువగా వాడుతున్నారట. ‘లాన్సెట్’ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Firecrackers In Delhi: ఢిల్లీలో బాణసంచా బ్యాన్.. జనవరి 1వరకు నిషేధిస్తూ ప్రభుత్వ నిర్ణయం

ఈ నివేదిక ప్రకారం.. కోవిడ్ సమయంలో, అంతకుముందు నుంచి కూడా భారతీయులు అధికంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అందులో చాలా వరకు కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆమోదం లేనివే ఉన్నాయి. దీనిపై తక్షణమే కేంద్రం స్పందించి కచ్చితమైన విధానం రూపొందించాలని, సంస్కరణలు తీసుకురావాలని లాన్సెట్ సూచించింది. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల ఇవి పనిచేయకుండా పోతాయని, వీటి నిరోధకత పెరిగేందుకు కారణమవుతుందని ఈ స్టడీ చెప్పింది.

Tejashwi Yadav: రాత్రిపూట ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన తేజస్వి యాదవ్.. నిద్ర పోయేందుకు రెడీ అవుతూ కనిపించిన సూపరిండెంట్

ఇతర దేశాల్లో తక్కువగా వాడే యాంటీబయాటిక్స్ మన దేశంలో అధిక మోతాదులో వాడుతున్నారు. అజిత్రోమైసిన్ తర్వాత సెఫిగ్జిమ్ ఎక్కువగా వాడుతున్నారు. మన దేశంలో మొత్తం 1,098 యునిక్ యాంటీబయాటిక్ ఫార్ములాలు ఉన్నాయి. అలాగే 10,100 వరకు యునిక్ బ్రాండ్లు ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు