Bihar: దుమారం రేపిన విద్యామంత్రి వ్యాఖ్యలు.. నాలుక కోసిన వారికి రూ.10 కోట్లు ఇస్తానంటున్న రామజన్మభూమి ప్రధాన అర్చకుడు

‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు విషం అయినట్లే నిమ్న కులాల వారు విద్యను పొందితే విద్య విషతుల్యమవుతారని రామచరితమానస్‭లో చెప్పారు. ఇది సమాజంలోని దళితులు-వెనుకబడినవారు, మహిళలు విద్యను పొందకుండా నిరోధిస్తుంది’’ అని అన్నారు.

Bihar: హిందూ మత గ్రంథమైన రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. చంద్రశేఖర్ ప్రకటనపై సాధువులు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొందరైతే కత్తి దుయ్యడానికి కూడా వెనకాడటం లేదు. ఈ ప్రకటనపై రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే, ఆయన కూడా వివాదాస్పదంగా స్పందించారు. కంటోన్మెంట్‌కు చెందిన మహంత్ పరమహంస్ దాస్.. చంద్రశేఖర్ నాలుక కోసిన వారికి 10 కోట్ల రూపాయల రివార్డు ఇస్తానని ప్రకటించారు. అలాంటి మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ఋషులు, సాధువులు మౌనంగా కూర్చోరంటూ హెచ్చరించారు.

Army Chief Manoj Pandey: చైనా సరిహద్దు సురక్షితం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం

ఇక అయోధ్యకు చెందిన సన్యాసి జగద్గురు పరమహంస ఆచార్య సైత మంత్రి చంద్రశేఖర్‭ను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రకటనతో దేశం చింతిస్తోందని, దీనిక ఆయన క్షమాపణ చెప్పాలని అన్నారు. రామచరితమానస్‌ అనేది ప్రజలను కలిపే పుస్తకమని, మానవత్వాన్ని స్థాపించే గ్రంథమని జగద్గురు అన్నారు. వీరే కాకుండా భారతీయ జనతా పార్టీ, హిందూ సంఘాల నుంచి ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎవరికి వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

దీనికి ముందు బీహార్ విద్యా మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘‘మనుస్మృతి, రామచరితమానస్, గురు గోల్వాల్కర్ పుస్తకాలు ద్వేషాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలు. ద్వేషం దేశాన్ని గొప్పగా చేయదు, ప్రేమ దేశాన్ని గొప్పగా చేస్తుంది’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు విషం అయినట్లే నిమ్న కులాల వారు విద్యను పొందితే విద్య విషతుల్యమవుతారని రామచరితమానస్‭లో చెప్పారు. ఇది సమాజంలోని దళితులు-వెనుకబడినవారు, మహిళలు విద్యను పొందకుండా నిరోధిస్తుంది’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు