ఎన్నికలు జరగకుండానే ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి

Lok Sabha elections 2024: ఆయన గెలిచారని నిర్థారిస్తూ ఎన్నికల అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు.

ఎన్నికలు జరగకుండానే గుజరాత్‌లోని సూరత్ బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఎంపీగా గెలిచారు. ఏకగ్రీవంగా ఆయన గెలిచారని నిర్థారిస్తూ ఎన్నికల అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. సూరత్ నుంచి ప్రధాన పోటీదారు, కాంగ్రెస్‌కు చెందిన నీలేశ్ కుంబానీ నామినేషన్ పత్రాలపై చేసిన సంతకంలో తేడా ఉందని ఆయన నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు.

బీజేపీ అభ్యర్థి తప్ప మిగిలిన అభ్యర్థులందరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖేశ్ దలాల్ ఒక్కరే పోటీలో మిగలడంతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉంది.

అప్పుడే గుజరాత్‌లో బీజేపీ తొలి విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుజరాత్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులో పోటీ చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికే ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరిగింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 26వ తేదీన 89 స్థానాలకు జరగనుంది.

Also Read : జీవన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు