Nitin Gadkari: వాడుకొని వదిలేయొద్దు: మోదీ-షా టార్గెట్‭గా గడ్కరీ వ్యాఖ్యలు?

బీజేపీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన గడ్కరీ.. ఆ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. అంతే కాకుండా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‭కు అత్యంత సన్నిహితుడు, ఆ సంస్థ నుంచి ఎక్కువ అండదండలు ఉన్న వ్యక్తిగా కూడా ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తిని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే సమయం చిక్కినప్పుడల్లా పరోక్షంగా ఇలా విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు.

Nitin Gadkari: కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా అంతకు మించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ వాడుకొని వదిలేయొద్దంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పేర్లు ప్రస్తావించకపోయినా ఆయన ఈ వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానాన్ని (మోదీ-అమిత్ షా) ఉద్దేశించి చేసినవేనని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో కీలక విభాగమైన పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీని తప్పించారు. బీజేపీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన గడ్కరీ.. ఆ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. అంతే కాకుండా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‭కు అత్యంత సన్నిహితుడు, ఆ సంస్థ నుంచి ఎక్కువ అండదండలు ఉన్న వ్యక్తిగా కూడా ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తిని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే సమయం చిక్కినప్పుడల్లా పరోక్షంగా ఇలా విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు.

#TwinTowers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతలో 10 కీలక అంశాలు

తాజాగా నాగ్‭పూర్‭లో జరిగిన పారిశ్రామికవేత్తల ప్రత్యేక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ ‘‘వ్యాపారం, సామాజిక పనులు, రాజకీయాలు.. ఎక్కడైనా సరే, మానవ సంబంధాలే అతిపెద్ద బలం. అయితే ఎవరూ వాడుకుని వదిలేసే మనస్తత్వంతో ఉండకూడదు. మంచైనా, చెడైనా.. సమయమేదైనా పట్టుకున్న చేతిని వదలకూడదు. ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కాదు, తనను పూర్తిగా వదిలేసినప్పుడే అంతమవుతాడు’’ అని గడ్కరి అన్నారు.

ఈ సందర్భంగా తాను విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయాన్ని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా శ్రీకాంత్ జిక్కర్ కోరారని, కానీ కాంగ్రెస్ భావజాలం తనకు నచ్చక భారతీయ జనతా పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం మంచిదని తాను అనుకున్నట్లు పేర్కొన్నారు.

Congress President: అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక

ట్రెండింగ్ వార్తలు