అరుదైన కూర్మం : బంగారు రంగులో మెరిసిపోతున్న తాబేలు

  • Publish Date - July 20, 2020 / 09:35 AM IST

ఒడిశాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఇంత వరకూ ఎప్పుడూ కనిపించని తాబేలు ఒకటి కనిపించి కనువిందు చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో రకాల తాబేళ్లను చూశాం. కానీ బంగారపు రంగులో మెరిసిపోతున్న తాబేలుని మాత్రం చూసి ఉండం. పసుపు రంగులో ధగధగా మెరిసిపోతూ.. అందరిని ఆకర్షిస్తోంది ఈ తాబేలు. బాలాసోర్‌ జిల్లాలోని సోరో బ్లాక్‌లోని సుజన్‌పూర్‌ గ్రామస్తులు ఆదివారం (జులై 19,2020)దీన్ని గుర్తించటంతో వెలుగులోకి వచ్చింది.

అచ్చంగా బంగారంతో చేసినట్లుగా మెరిసిపోతోంది. ఈ పసిడి కూర్మాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి దాన్ని అందజేశారు.
ఆ బంగారు రంగు తాబేలుని స్వాధీనం చేసుకున్న వైల్డ్ లైఫ్ వార్డెన్ భానూమిత్రం ఆచార్య కూడా ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. ఇటువంటి ప్రత్యేక తాబేలుని ఎప్పుడూ చూడలేని అన్నారు.

దీనిపై అటవీశాఖ అధికారి సుశాంత నందా కూడా బంగారు తాబేలుకి చెందిన ఓ వీడియోను ట్విట్టర్ లోపోస్టు చేస్తూ..ఇటువంటి తాబేళ్లను ఆల్బినో అంటారని..కొన్నాళ్ల క్రితం సింథ్ లో ఇటువంటి తాబేలుని చూశామని స్థానికులు అన్నారని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు