Idgah Maidan: అసదుద్దీన్ మీటింగ్ అయిపోగానే గోమూత్రంతో వెళ్లి ఈద్గా మైదానాన్ని శుభ్రం చేసిన శ్రీరాం సేన

టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా హుబ్బలిలోని ఈద్గా మైదానంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఎంఐఎం అధినేత ఓవైసీ అనుమతి తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో గురువారం (నవంబర్ 10) టిప్పు సుల్తాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇకపోతే.. ఈద్గా మైదానం ఎవరిదనే విషయమై తరుచూ వివాదాలు చెలరేగుతున్నాయి.

Idgah Maidan: కర్ణాటక రాష్ట్రం హుబ్బలిలోని ఈద్గా మైదానం వివాదాలకు దారి తీస్తోంది. రైట్ వింగ్, మిగిలిన వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు అదొక కేంద్రంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం అక్కడ వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కొనసాగిన హైడ్రామా అనంతరం, కర్ణాటక హైకోర్టు కలుగజేసుకుని ఆ మైదానంలో నిర్వహణకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. తాజాగా ఈ మైదానం మరో కాంట్రవర్సీకి తెరలేపిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కర్ణాటక రాయల్ కింగ్ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు గురువారం ఈద్గా మైదానంలో జరిగాయి.

అయితే ఈ ఉత్సవాలు ముగిసిన మరునాడే శ్రీరాం సేన గోమూత్రంతో వచ్చి ఈద్గా మైదానాన్ని శుభ్రం చేసింది. శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ తన అనుచరులతో అక్కడికి వచ్చి ఈ తతంగం పూర్తి చేశారు. ఇక ఇదే మైదానంలో శుక్రవారం కనక దాస్ జయంతి ఉత్సవాల్ని నిర్వహించేందుకు శ్రీరాం సేన ఏర్పాట్లు చేస్తోంది.

టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా హుబ్బలిలోని ఈద్గా మైదానంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఎంఐఎం అధినేత ఓవైసీ అనుమతి తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో గురువారం (నవంబర్ 10) టిప్పు సుల్తాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇకపోతే.. ఈద్గా మైదానం ఎవరిదనే విషయమై తరుచూ వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఇది రెవెన్యూ విభాగానికి చెందినదని బెంగళూరు మహానగర పాలిక గతంలో స్పష్టం చేసింది. కానీ దానికి అనుగునమైన ప్రభుత్వ రికార్డులేవీ బయటికి వెళ్లడించకపోవడంతో ఇంకా ఆ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Shivling: జ్ఞానవాపి మసీదు అంశంలో పాత తీర్పునే పొడగించిన సుప్రీం కోర్టు

ట్రెండింగ్ వార్తలు