నేను అప్పుడే చెప్పాను.. ఇప్పుడు నిజమైంది.. అందరినీ అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్

పనికిమాలిన కేసుల్లో ఆప్ నేతలందరినీ ఒక్కొక్కరిగా అరెస్టు చేయిస్తున్నారని అన్నారు.

బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ మంత్రి అతిశీకి ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు ​​జారీ చేయడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘అతిశీని అరెస్ట్ చేస్తారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు ఇదే ప్లాన్‌లో ఉన్నారు. ఇదిగా పూర్తిగా నియంతృత్వమే’’ అని అన్నారు

‘‘పనికిమాలిన కేసుల్లో ఆప్ నేతలందరినీ ఒక్కొక్కరిగా అరెస్టు చేయిస్తున్నారు. దేశంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ప్రతిపక్ష నేతను అరెస్టు చేయిస్తారు. ఆప్ ముఖ్యం కాదు. దేశాన్ని నియంతృత్వం నుంచి రక్షించడమే ముఖ్యం’’ అని కేజ్రీవాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

కాగా, గోవా, మణిపూర్ తో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేసిందంటూ అతిశీ కూడా నిలదీశారు. ఎన్నికల్లో మెజార్టీ రాకుండానే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేస్తుందో చెప్పాలని అన్నారు.

అతిశీ కొన్ని నెలల క్రితం బీజేపీపై ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామంటూ ఆప్ నేతలను కొనడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

Also Read: సీఎం జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడు సతీశ్‌కు బెయిల్  

ట్రెండింగ్ వార్తలు