ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిలో ఎవరిది పైచేయి? బీజేపీ హ్యాట్రిక్ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయి?

ఈ హోరాహోరి పోరులో గెలిచేదెవరు? జాతీయ స్థాయిలో చక్రం తిప్పే కూటమి ఏది?

Lok Sabha Elections 2024 : లోక్ సభ సమరం తుది అంకానికి చేరింది. జూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో సార్వత్రిక సమరం ముగియనుంది. ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ తో మొదలైన యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఇటు ప్రధాని మోదీ… అటు ఇండియా కూటమి తరుపున రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేజ్రీవాల్, మమతల మధ్య మాట యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. మరి ఈ హోరాహోరి పోరులో గెలిచేదెవరు? జాతీయ స్థాయిలో చక్రం తిప్పే కూటమి ఏది?

మా ప్రధాని అభ్యర్థి మోదీ.. మరి మీ వైపు? అన్నట్లు ప్రచారం సాగించిన బీజేపీ.. విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రధాని మోదీ కూడా సుడిగాలి పర్యటనలతో రెట్టించిన ఉత్సాహంతో దేశం మొత్తాన్ని చుట్టేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అలుపెరగకుండా పర్యటించిన ప్రధాని.. అధికార పార్టీలో వన్ అండ్ ఓన్లీ లీడర్ గా మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోయేది తానే అన్న వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. అటు విపక్షం కూడా ప్రధాని ఎవరన్న చర్చకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా గెలుపే ప్రధానం అన్నట్లు ముందుకు కదిలింది.

 

Also Read : శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్.. అంతర్జాతీయంగా మరింత శక్తిమంతంగా మారిన ఇండియా

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు