ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో కేసీఆర్‌ పేరే లేదు- కవిత లాయర్‌ మోహిత్‌రావు

సిట్టింగ్ ముఖ్యమంత్రికి బెయిల్ ఇస్తే తారుమారు చేయరా? అని లాయర్ మోహిత్ రావు అన్నారు.

Delhi Liquor Case : లిక్కర్ స్కామ్ కేసులో అంతా కేసీఆర్ కు తెలిసే జరిగిందంటూ వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని కవిత తరుపు న్యాయవాది మోహిత్ రావు అంటున్నారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు మోహిత్ రావు. దీన్ని కొందరు వక్రీకరించారని ఆరోపించారాయన. మాగుంట రాఘవ.. ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రస్తావించారని, దాన్ని కేసీఆర్ పేరుగా వక్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు కవిత తరుపు న్యాయవాది మోహిత్ రావు.

”కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా ఈడీ.. కేసీఆర్ పేరు ప్రస్తావన చేసిందన్న ప్రచారంలో నిజం లేదు. ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు. ఎక్కడా కూడా కేసీఆర్ పేరు రాలేదు. ఈడీ ఫైల్ చేసిన రిప్లయ్ లో కూడా కేసీఆర్ పేరు లేదు. వాదనల సందర్భంగా మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ఈడీ ప్రస్తావించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ప్రస్తావించారు.

మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులు రెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వారిని పరిచయం చేశానని చెప్పారు. కొందరు కావాలని రాజకీయంగా కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టులో కవితకు తప్పకుండా బెయిల్ వస్తుంది. కవిత ఆధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని తప్పుడు వాదనలు చేస్తున్నారు. సిట్టింగ్ ముఖ్యమంత్రికి బెయిల్ ఇస్తే తారుమారు చేయరా? కవితకు హైకోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం” అని లాయర్ మోహిత్ రావు అన్నారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

 

 

ట్రెండింగ్ వార్తలు