Vaishno Devi Temple : వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి

మాత వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు

Vaishno Devi Temple : కొత్త సంవత్సరం రోజు మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి 12 మంది భక్తులు మృతి చెందినట్లుగా జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 20 మందివరకు గాయపడి ఉంటారని ప్రాథమిక సమాచారం.

చదవండి : Jammu Kashmir : శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ ఉగ్రవాది హతం

గాయపడిన వారిని సమీపంలోని నరైనా ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో చాలా మంది భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మాతా వైష్ణోదేవి ఆలయ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ కేంద్రమంత్రులు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి, ప్రధాని. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడిన వారికి 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ప్రకటించారు జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ మనోజ్ సిన్హా.

ఘటనపై జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, నిత్యానంద రాయ్‌తో మోదీ మాట్లాడారు. ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు మాతా వైష్ణోదేవి ఆలయానికి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెళ్లారు. తొక్కిసలాట ఘటన అంశాన్ని నేరుగా ప్రధాని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.

చదవండి : Jammu and Kashmir : యాత్రికులను వదిలేసి పరారైన ట్రావెల్ ఏజెన్సీ..జమ్ముకశ్మీర్‌లోని హోటల్‌లో చిక్కుకున్న సిక్కోలు వాసులు

 

 

 

ట్రెండింగ్ వార్తలు