Umran Malik Call Up : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. సంచలన పేసర్‌కు టీమిండియాలో చోటు

సంచలన పేస్ బౌలర్, జమ్మూ కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కింది. 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులేస్తూ, నిలకడగా రాణిస్తూ..(Umran Malik Call Up)

Umran Malik Call Up : సౌతాఫ్రికాతో త్వరలో జరిగే టీ20 సిరీస్ కు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. సంచలన పేస్ బౌలర్, జమ్మూ కశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ఈ యువ పేస్ సంచలనం 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులేస్తూ అందరి దృష్టి అట్రాక్ట్ చేశాడు. ప్రస్తుత టోర్నీలో చాలా నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నాడు. 150కిమీ వేగానికి పైగా బంతులు సంధిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 157 కిమీ వేగంతో బౌలింగ్‌ చేశాడు ఉమ్రాన్ మాలిక్.

ఉమ్రాన్ తో పాటు అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు. పొట్టి ఫార్మాట్ లో దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చారు. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ సిరీస్ లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.(Umran Malik Call Up)

Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్

ఈ టీ20 సిరీస్ జూన్ 9 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్‌ 9న ఢిల్లీ, 12న కటక్‌, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో టీ20 మ్యాచులు జరుగనున్నాయి. ఈ సిరీస్ లో 14వ తేదీన జరిగే మూడో మ్యాచ్ కు విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

Umran Malik

అటు, ఇంగ్లండ్ తో గతంలో నిలిచిపోయిన ఐదో టెస్టుకు కూడా జట్టును ఎంపిక చేశారు సెలెక్టర్లు. అప్పట్లో భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ టెస్టును రీషెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్ జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది.

భారత్ టీ20 జట్టు..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైఎస్ కెప్టెన్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.(Umran Malik Call Up)

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భారత జట్టు…
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్‌ స్టైల్‌లో అమెరికాలోనూ టీ20 లీగ్

జులై 1 నుంచి ఇంగ్లాండ్‌ పర్యటన మొదలవుతుంది. టీమిండియా అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అంతకన్నా ముందు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఉంటాయి.

Umran Malik (1)

కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్‌ యువ పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రస్తుత టోర్నీలో చాలా నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నాడు. 150కిమీ వేగానికి పైగా బంతులు సంధిస్తున్నాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్ టీమిండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్‌ అవుతాడని సీనియర్ క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉమ్రాన్‌ రోజు రోజుకూ రాటుదేలుతున్నాడని, మేటి పేసర్‌గా తయారవుతున్నాడని శ్రీలంక దిగ్గజ పేసర్‌ చమిందా వాస్‌ అన్నాడు. చాలా నిలకడగా 150 కిమీల వేగానికి పైగా బౌలింగ్‌ చేస్తున్నాడు, టీ20 క్రికెట్‌లో కచ్చితత్వం అనేది అత్యంత ముఖ్యమైన విషయం, అతడు ఇలాగే రాణిస్తే టీమిండియా తరఫున అత్యంత గొప్ప బౌలర్‌ అవుతాడు అని వాస్ అన్నాడు.(Umran Malik Call Up)

ట్రెండింగ్ వార్తలు