Sania Mirza : ఇంటి నేమ్‌ప్లేట్‌ను మార్చేసిన మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. కొత్త నేమ్‌ప్లేట్‌లో ఎవ‌రి పేరుందంటే?

భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త‌న మ‌న‌సుకు క‌ష్టం క‌లిగించిన జ్ఞాప‌కాల‌ను ఒక్కొక్క‌టిగా మ‌రిచిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Sania Mirza – Izhaan : భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త‌న మ‌న‌సుకు క‌ష్టం క‌లిగించిన జ్ఞాప‌కాల‌ను ఒక్కొక్క‌టిగా మ‌రిచిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. భ‌ర్త షోయ‌బ్ మాలిక్‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న కొడుకుతో క‌లిసి ఒంట‌రిగా జీవిస్తోంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను పంచుకుంటూ ఉంటోంది. తాజాగా కొన్ని ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

త‌న ఇంటి నేమ్‌ప్లేట్‌ను ఛేంజ్‌చేసింది. త‌న ఇంటి కొత్త నేమ్‌ప్లేట్‌లో త‌న పేరుతో పాటు త‌న కొడుకు పేరు ఉండేలా సానియా అండ్‌ ఇజాన్ అని త‌యారు చేయించుకుంది. దీన్ని త‌న ఇంటి ముందు త‌గిలించేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసుకుంది. త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి మంచి స‌మ‌యాన్ని గ‌డుపుతున్న‌ట్లుగా ఫోటోల ద్వారా అర్థ‌మ‌వుతోంది.

Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డుకు చేరువలో కోహ్లీ.. రాజస్థాన్ అడ్డుకోగలదా..

సానియా షేర్ చేసిన ఫోటోల్లో త‌న ఇంటి నేమ్‌ప్లేట్ ఫోటో వైర‌ల్‌గా మారింది. సానియా ఆనందంగా ఉండ‌డంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైద‌రాబాద్‌లో వీరి పెళ్లి 2010లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు 2018లో కొడుకు ఇజాన్ జ‌న్మించాడు. అయితే..కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇటీవ‌ల వీరిద్ద‌రు విడిపోయారు. ఆ వెంట‌నే షోయ‌బ్ మాలిక్ పాకిస్తాన్ న‌టి స‌నా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. కాగా.. సానియా కుమారుడు ఇజాన్‌తో క‌లిసి దుబాయ్‌లో నివ‌సిస్తోంది. 2023లో ఆమె టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పింది.

BAN vs USA Match : టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టుకు షాకిచ్చిన అమెరికా..

ట్రెండింగ్ వార్తలు