iQOO Z7 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ Z7 ప్రో ఫోన్ వచ్చేసింది.. ఈ 5G ఫోన్ ధర ఎంతో తెలుసా? సేల్ డేట్ ఎప్పుడంటే?

iQOO Z7 Pro Launch : భారత మార్కెట్లో iQOO Z7 Pro 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ 5G ఫోన్ (OnePlus Nord CE 3) వంటి ఇతర ప్రముఖ ఫోన్‌లతో పోటీగా వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iQOO Z7 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్లకు పోటీగా ఐక్యూ (iQOO) నుంచి Z7 Pro 5G ఫోన్ మోడల్ వచ్చేసింది. ఈ 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 23,999 నుంచి ఉంటుంది. ఈ కొత్త 5G ఫోన్ (OnePlus Nord CE 3) వంటి ప్రముఖ ఫోన్‌లతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. కొత్త మిడ్-రేంజ్ 5G ఫోన్ భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన MediaTek SoCతో వస్తుంది. ఐక్యూ Z7 Pro ప్రత్యేకమైన బ్లూ లగూన్ పెయింట్ జాబ్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంది.

Read Also : Jio AirFiber vs Airtel AirFiber : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌కు పోటీగా జియో ఎయిర్‌ఫైబర్.. రెండింటి మధ్య ఇంటర్నెట్ స్పీడ్, ధర ఎంత? బెనిఫిట్స్ ఏంటి?

ఐక్యూ Z7 ప్రో భారత్‌లో ధర ఎంతంటే? :
ఐక్యూ Z7 ప్రో ధర 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 23,999 ఉంటుంది. కానీ, లాంచ్ ఆఫర్‌లో భాగంగా ప్రభావవంతంగా రూ.21,999కి విక్రయిస్తోంది. అదేవిధంగా, 256GB మోడల్ ధర రూ. 24,999, లాంచ్ ధర రూ.22,999కు అందిస్తుంది. ఈ సేల్ ఆఫర్‌లు పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోండి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon), iQOO e-స్టోర్ ద్వారా 5G ఫోన్‌ను పొందవచ్చు. ఈ కొత్త ఐక్యూ Z7 ప్రో ఫోన్ సెప్టెంబర్ 5 న ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి రానుంది. వినియోగదారులు బ్లూ లగూన్, గ్రాఫైట్ మాట్ అనే 2 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు.

iQOO Z7 Pro launched in India, price effectively starts at Rs 21,999

ఐక్యూ Z7 ప్రో ఫీచర్లు ఏంటి? :
iQOO Z7 Pro ఫన్ ఫుల్ HD రిజల్యూషన్‌తో కూడిన భారీ 6.74-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. శక్తివంతమైన మిడ్-రేంజ్ SoC చిప్ 12GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ డివైజ్ Android 13 OSతో ద్వారా రన్ అవుతుంది. కొత్త iQOO Z7 Pro ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 64MP ప్రధాన కెమెరా, రింగ్ ఆకారంలో LED ఫ్లాష్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది.

2MP సెన్సార్‌, సెల్ఫీల కోసం, ఫోన్ ఫ్రంట్ సైడ్ 16MP సెన్సార్‌ను అందించింది. సింగిల్ పంచ్-హోల్ కటౌట్‌తో వచ్చింది. కనెక్టివిటీ పరంగా.. Wi-Fi 6, బ్లూటూత్ 5.3కి సపోర్టు అందిస్తుంది. iQOO నుంచి వచ్చిన కొత్త 5G ఫోన్ 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ 66W ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్ట్‌ను అందించింది. iQOO ఇప్పటికీ 5G ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తోంది. భద్రతా ప్రయోజనాలకు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అయితే, ఐక్యూ దిగువన ఒకే స్పీకర్‌ను కలిగి ఉంది.

Read Also : Google AI Features India : గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త సెర్చ్ ఫీచర్లు.. భారతీయ యూజర్లు ఎలా వాడొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు