Jio vs Airtel Monthly Fiber Plans : యూజర్లకు పండగే.. జియో, ఎయిర్‌టెల్ నెలవారీ ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ల ఫుల్ లిస్టు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Jio vs Airtel Monthly Fiber Plans : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ ఫైబర్ కనెక్షన్‌పై నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తాయి. అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ OTT బెనిఫిట్స్, గేమ్‌లు ఆడేందుకు, ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడానికి, స్ట్రీమ్ చేసుకోవచ్చు. పూర్తి జాబితాను ఓసారి చెక్ చేయండి.

Jio vs Airtel Monthly Fiber Plans : కొత్త ఫైబర్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? రిలయన్స్ జియో (Reliance Jio) ఇటీవలే (AirFiber) సర్వీసును అందించనున్నట్టు ప్రకటించింది. 5G డేటాతో పాటు ఇతర బెనిఫిట్స్ అందించే వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసు ప్రారంభ తేదీని ప్రకటించింది. గణేష్ చతుర్థి రోజున.. అంటే, సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ సర్వీసును ప్రారంభించనుంది. ఇప్పటికే (Airtel Xstream AirFiber) అందిస్తున్న ఎయిర్‌టెల్ (Jio AirFiber)కు ప్రధాన పోటీదారుగా ఉంటుంది. AirFiber కేటగిరీలో ఏ టెల్కో మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకోవచ్చు.

Jio, Airtel వైర్డ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల ప్లాన్‌లను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ రెండూ తమ కస్టమర్ల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌ల స్పీడ్ 30Mbps నుంచి 1Gbps వరకు ఉంటుంది. ఉచిత OTT సభ్యత్వాల వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే, హై-స్పీడ్ ఇంటర్నెట్, OTT బెనిఫిట్స్, మరిన్నింటిని అందించే Jio, Airtel ప్రీపెయిడ్ నెలవారీ ఫైబర్ ప్లాన్‌లను నిశితంగా పరిశీలిద్దాం.

Read Also : Google AI Features India : గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త సెర్చ్ ఫీచర్లు.. భారతీయ యూజర్లు ఎలా వాడొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!

జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి జాబితా :
రూ. 399 ప్లాన్ : ఈ ప్లాన్ 30Mbps స్పీడ్ అన్‌లిమిటెడ్ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.
రూ. 699 ప్లాన్ : ఈ ప్లాన్ 100Mbps స్పీడ్‌తో ఫ్రీ వాయిస్ కాలింగ్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని 30 రోజుల నెలవారీ వ్యాలిడిటీతో అందిస్తుంది.
రూ. 999 ప్లాన్ : ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్‌తో 150Mbps స్పీడ్‌ని అందిస్తుంది. JioTV, Jio సినిమా, Jio సెక్యూరిటీ, Jio క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
రూ. 1499 ప్లాన్ : ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), జియోసినిమా, జియోసావ్న్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, ఇతర వాటితో సహా 18OTT ఛానెల్స్ ఉచిత సభ్యత్వంతో 300Mbps స్పీడ్ అందిస్తుంది.
రూ. 2499 ప్లాన్ : ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, 16 ఇతర యాప్‌లకు 500Mbps స్పీడ్ ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది.
రూ. 3999 ప్లాన్: ఈ ప్లాన్ 1Gbps స్పీడ్‌తో 35000GB డేటా (35000GB + 7500GB బోనస్) అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, ఇతరులతో సహా 19 యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
రూ. 8499 ప్లాన్: అత్యంత ఖరీదైన ప్లాన్, 1Gbps వేగంతో మొత్తం 6600GB డేటాను అందిస్తుంది. అదనంగా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, ఇతరులతో సహా 19 యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.

అన్ని జియో ఫైబర్ ప్లాన్‌లపై ఫ్రీ రూటర్, ఇన్‌స్టాలేషన్‌ అందిస్తాయి. మీరు ల్యాండ్‌లైన్ కనెక్షన్ లేదా అధిక డేటా క్యాప్ వంటి అదనపు యాడ్-ఆన్‌లను అందుకోవచ్చు. ఈ ప్లాన్‌ల సభ్యత్వం పొందడానికి Jio Fiber వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.

Jio vs Airtel monthly fiber plans _ Price, speed, data, OTT benefits and other compared

ఎయిర్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్లల పూర్తి జాబితా :
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ. 499 ప్లాన్ : అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్‌తో 40Mbps స్పీడ్ అందించే బేసిక్ ప్లాన్. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్యాక్, వింక్ మ్యూజిక్, అపోలో 24X7కి ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ రూ. 799 ప్లాన్ : 100Mbps స్పీడ్ అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్‌ను అందించే ప్రామాణిక ప్లాన్. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్యాక్ యాప్, అపోలో 24X7, వింక్ మ్యూజిక్‌కి ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 999 ప్లాన్ : ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్, దీని కింద ఎయిర్‌టెల్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, మరిన్నింటికి 200Mbps స్పీడ్ ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 1498 ప్లాన్ : ప్రొఫెషనల్ ప్యాక్స్ నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హోస్టార్, మరిన్నింటికి 300Mbps స్పీడ్ ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తాయి.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ 3999 ప్లాన్ : 1Gbps స్పీడ్ అందించే ఇన్ఫినిటీ ప్లాన్. అదనంగా నెట్‌ఫ్లిక్స్ (ప్రీమియం), అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, మరిన్నింటికి ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తుంది.

ముఖ్యంగా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్లలు ఉచిత ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్, ఇన్‌స్టాలేషన్‌తో వస్తాయి. మీరు ల్యాండ్‌లైన్ లేదా అధిక డేటా క్యాప్‌ను యాడ్-ఆన్‌లుగా చేర్చవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ద్వారా మీరు ప్లాన్‌ల గురించి తెలుసుకుని వెంటనే సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

Read Also : iQOO Z7 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ Z7 ప్రో ఫోన్ వచ్చేసింది.. ఈ 5G ఫోన్ ధర ఎంతో తెలుసా? సేల్ డేట్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు