Komatireddy Venkat Reddy : ఎవర్రా బానిసలు? ఆమెను ఒక్క మాట అన్నా పాపం తగులుతుంది- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు

పార్లమెంటులో కేసీఆర్ ఒక్కసారైనా తెలంగాణ కోసం మాట్లాడారా? మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా? Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy – KTR : తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ పేరుతో కేటీఆర్ లక్షల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానుకోవాలని.. సోనియా గాంధీపైనా, కాంగ్రెస్ పైనా నోరు పారేసుకోవద్దని కేటీఆర్ కు హితవు పలికారాయన.

”నాడు సోనియాతో గ్రూప్ ఫొటో కూడా దిగావు కదా కేటీఆర్. ఇంకోసారి సోనియాపై మాట్లాడితే పాపం తగులుతుంది. కేటీఆర్.. రాజకీయాల్లో నీకేం అనుభవం ఉంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు. రెండో దశ ప్రారంభం కాగానే వచ్చావు. కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ రాలేదని కేటీఆర్ తెలుసుకోవాలి” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Also Read..KTR: అందుకే తెలంగాణ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? కేటీఆర్ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా?

” కేటీఆర్ కి కొంత నాలెడ్జ్ ఉంది అనుకున్నా. ఈరోజు చిట్ చాట్ తర్వాత కేటీఆర్ కి ఏమీ తెలియదని అర్థమైంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమే. రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి కేటీఆర్. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టారు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మేం తెలంగాణ కోసం కొట్లాడాము.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలి. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారు. సోనియా పాత్ర లేదని కేటీఆర్ అంటున్నారు. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చారు. సోనియా, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కేటీఆర్ కి తగదు. కాంగ్రెస్ హయాంలో ఒకటవ తారీఖున పింఛన్లు వచ్చేవి. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిందో చెప్పాలి. ఎన్నికలు వస్తున్నాయనే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు.

పార్లమెంటులో కేసీఆర్ ఒక్కసారైనా తెలంగాణ కోసం మాట్లాడారా? కేబినెట్ మంత్రుల్లో చాలామంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళే. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియాని ఎందుకు కలిసింది? ఎందుకు గ్రూప్ ఫోటో దిగింది. మహమూద్ అలీ, పద్మా దేవేందర్ రెడ్డిలను బానిసల్లా చూసింది కేసీఆరే. మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా?

Also Read..BRS Party: బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఆ మూడు స్థానాలు!

కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు. బీఆర్ఎస్ లో అలా కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్షు ముఖ్యమంత్రి అవుతాడు. మా చెల్లిని అరెస్ట్ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్.. అమిత్ షాకి చెప్పి వచ్చారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి? దలితబంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నా” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు