Janakipuram Sarpanch Navya : కిరోసిన్‌ పోసి తగలబెడతా-ఎమ్మెల్యే పేరు ఎత్తకుండానే సర్పంచ్‌ నవ్య స్ట్రాంగ్ వార్నింగ్

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మాకు ఇచ్చే గౌరవం, విలువలు మాకు ఇయ్యకుంటే.. అన్యాయంగా అరాచకాలు జరిగితే కిరోసిన్ పోసి తగలబెట్టడానికి నా లాంటి వందల మంది ఆడోళ్లు పుట్టుకువస్తారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అణచివేతలను ధైర్యంగా ఎదుర్కొవాలి.

Janakipuram Sarpanch Navya : ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య. ఎమ్మెల్యే రాజయ్య పక్కన ఉండగానే తీవ్ర ఆరోపణలు చేశారామె. అంతేకాదు ఎమ్మెల్యే పేరు ఎత్తకుండానే ఘాటుగా వార్నింగ్ లు కూడా ఇచ్చారు. నా విషయంలో తప్పు చేసిన వారిని క్షమిస్తున్నా అని అన్న సర్పంచ్ నవ్య.. లైంగికంగా వేధించిన వెధవల భరతం పడతానని హెచ్చరించారు. తాను మాట్లాడిన ప్రతి మాటా వాస్తవమే అన్నారామె. నన్ను వేధించినట్టే ఎవరినైనా వేధిస్తే కిరోసిన్ పోసి తగలబెడతానని సర్పంచ్ నవ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

”మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మాకు ఇచ్చే గౌరవం, విలువలు మాకు ఇయ్యకుంటే.. అన్యాయంగా అరాచకాలు జరిగితే కిరోసిన్ పోసి తగలబెట్టడానికి నా లాంటి వందలమంది ఆడోళ్లు పుట్టుకొస్తారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అణచివేతలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్యాయాలపై పోరాడాలి” అని సర్పంచ్ నవ్య అన్నారు.

Also Read.. Telangana : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారు,చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారు : మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

అదే సమయంలో.. ”మీ వల్ల ఇప్పటివరకు మా గ్రామానికి ఒరిగిందేమీ లేదు. మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మీడియా ముందు చెప్పాలి” అని సర్పంచ్ నవ్య అనడంతో.. పక్కనే ఉన్న ఎమ్మెల్యే రాజయ్య కంగుతిన్నారు.

కాగా, ఎమ్మెల్యే రాజయ్య.. సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. మహిళా సర్పంచ్, ఆమె భర్తతో కలిసి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే రాజయ్య. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్టు చెప్పారు. మహిళలకు అన్యాయం జరిగితే నా వంతు పోరాటం చేస్తానని రాజయ్య అన్నారు.

జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరింది. పార్టీ పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లినట్లు తెలుస్తోంది. రాజయ్య తనను లైంగికంగా వేధించారని ఇటీవల నవ్య చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. దీంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. వారి జోక్యంతో వివాదానికి తెరపడినట్లు తెలుస్తోంది.

Also Read..BRS MLA Rajaiah-Sarpanch Navya: క్షమాపణలు చెప్పిన రాజయ్య.. ఎమ్మెల్యే, సర్పంచ్‌ నవ్య మధ్య సయోధ్య

బీఆర్ఎస్ నేత, సర్పంచ్ నవ్య.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై చేసిన లైంగిక ఆరోపణలు సంచనలం రేపిన సంగతి తెలిసిందే. నవ్య ఆరోపణలు రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. ఈ క్రమంలో.. తనపై సంచలన ఆరోపణలు చేసిన మహిళా సర్పంచ్ ఇంటికి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెళ్లారు. తనను వేధిస్తున్నారని ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణల గురించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడారు రాజయ్య.

పార్టీ అధిష్ఠానం నవ్య దంపతులతో మాట్లాడిందని… నవ్వ భర్త ఆహ్వానం మేరకే.. ఇంటికి వచ్చినట్టు రాజయ్య తెలిపారు. పార్టీలో అప్పుడప్పుడు ఇలాంటి అరమరికలు వచ్చినప్పుడు మాట్లాడుకుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని రాజయ్య చెప్పుకొచ్చారు. నవ్యను తానెప్పుడు చిన్నచూపు చూడలేదని.. పక్కకు పెట్టలేదని తెలిపారు. ఒకవేళ తన వల్ల తెలిసో తెలియకో ఏవైనా తప్పులు జరిగుంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇన్ని రోజులు జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని అన్నారు. కొన్ని పొరపాట్లు జరిగి ఉంటే క్షమాపణలు చెపుతున్నా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు