Ganta Srinivasa Rao : వీడని సస్పెన్స్.. గంటా శ్రీనివాసరావు పోటీ చేసేది ఎక్కడి నుంచి?

చంద్రబాబుతో సమావేశం తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇంకా స్పష్టత రాలేదు.

Ganta Srinivasa Rao Seat Issue

Ganta Srinivasa Rao : టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసే స్థానం విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. అమరావతిలో చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు భేటీ ముగిసింది. తాను పోటీ చేసే స్థానంపై చంద్రబాబుతో గంటా చర్చించారు. చంద్రబాబుతో సమావేశం తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇంకా స్పష్టత రాలేదు.

చంద్రబాబుతో భేటీ అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే, తాను భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పినట్లు గంటా వెల్లడించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పినట్లు గంటా స్పష్టం చేశారు. నువ్వు ఎక్కడి నుంచి బరిలోకి దిగినా గెలుస్తావని చంద్రబాబు నాతో చెప్పారని గంటా పేర్కొన్నారు.

”కొద్ది రోజులుగా చీపురుపల్లి నుంచి పోటీ పై చంద్రబాబు పాజిటివ్ గా ఉన్నారు. నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పారు. ఒకసారి ఆలోచించమన్నారు. నేనైతే నా అభిప్రాయం చెప్పాను. విశాఖపట్నం జిల్లాలో ఉండాలని అనుకుంటున్నాను. భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నాకు వదిలేయమని చంద్రబాబు చెప్పారు. చీపురుపల్లా? భీమిలా? నీకు ఏది బాగుంటుందో చూసి నేను నిర్ణయం తీసుకుంటాను అని చంద్రబాబు చెప్పారు. మళ్లీ రెండు మూడు రోజుల్లో కలుద్దాం అని చంద్రబాబు నాతో చెప్పారు” అని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

 

ట్రెండింగ్ వార్తలు