Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

Apple iPhone 15 Sale : ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ ఈరోజు (జూన్ 19) ముగియనుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 15 Sale : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను వండర్‌లాస్ట్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. భారత్‌లో ఆపిల్ స్టోర్‌ల వెలుపల లేటెస్ట్ ఐఫోన్ పొందవచ్చు.

Read Also : iPhone 15 Pro Action Button : ఐఓఎస్ 18 సపోర్టు.. ఆపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు..!

ఈ సమయంలో 128జీబీ మోడల్ ఐఫోన్ 15 ధర రూ. 79,900 కాగా, 256జీబీ, 512జీబీ వేరియంట్‌లు వరుసగా రూ. 89,900, రూ. 1,09,900గా ధర ట్యాగ్ అయ్యాయి. ఇప్పుడు, ఐఫోన్ 15పై దృష్టి సారించే వినియోగదారులకు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ ఈరోజు (జూన్ 19) ముగియనుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 తక్కువ ధరకు సొంతం చేసుకునేందుకు అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 తగ్గింపు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మోడల్ 128జీబీ వేరియంట్‌ను 14 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఐఫోన్ ధర రూ.67,999కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో లేదాపాత స్మార్ట్‌ఫోన్‌లో ట్రేడింగ్ చేయడం ద్వారా ఐఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ట్రేడ్-ఇన్ వాల్యూతో మీ పాత ఫోన్ వర్కింగ్ కండిసన్‌పై ఆధారపడి ఉంటుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐ రహిత లావాదేవీలపై అదనంగా రూ. వెయ్యి ఆఫ్ బ్యాంక్ ఆఫర్ అందిస్తుంది.

ఐఫోన్ 15 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మొత్తం పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ మోడల్ ఐఫోన్ 14 గత మోడళ్ల మాదిరి డిజైన్ కలిగి ఉంది. అయితే, గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడల్‌ల నుంచి పాపులర్ ఫీచర్ అయిన డైనమిక్ ఐలాండ్ నాచ్‌తో సాంప్రదాయ నాచ్‌ను కలిగి ఉంది.

కెమెరా విభాగానికి వస్తే.. ఐఫోన్ 15 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో భారీ అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంది. మెరుగైన లో-లైటింగ్ ఫొటోగ్రఫీతో పాటు అద్భుతమైన పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుందని ఆపిల్ పేర్కొంది. ఇటీవలి నివేదికలో బ్యాటరీ లైఫ్ ప్రారంభంలో కన్నా రెట్టింపుగా సూచిస్తుంది. ఐఫోన్ 15 మోడల్ 80 శాతం బ్యాటరీ హెల్త్‌తో 500 ఛార్జింగ్ సైకిల్స్ అందిస్తుంది. అయితే, ఆపిల్ ఇప్పుడు 1000 సైకిళ్లను తట్టుకోగలదని పేర్కొంది.

ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ A16 బయోనిక్ చిప్‌తో ఆధారంగా పనిచేస్తాయి. గత ఏడాదిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఉపయోగించిన A15 బయోనిక్ చిప్‌సెట్ నుంచి అప్‌గ్రేడ్ అయింది. ఐఫోన్ ప్రో మోడల్‌లు గత ఏడాదిలో A16 చిప్‌ను అందుకున్నాయి. అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఐఫోన్ 15లో యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌కి మారవచ్చు. ఆపిల్ లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్-సి ఛార్జర్ కలిగి ఉంది.

Read Also : Best Flagship Mobile Phones : ఈ జూన్ 2024లో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు