Apple Cheaper Vision Pro : అందుకే.. ఆపిల్ చౌకైన కొత్త విజన్ ప్రో తీసుకొస్తోంది.. ఐఫోన్ ధరతో సమానంగా ఉంటుందట!

Apple Cheaper Vision Pro : వీఆర్ హెడ్‌సెట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అమ్మకానికి వచ్చింది. విజన్ ప్రో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయని పేర్కొంది. అందుకే, చౌకైన విజన్ ప్రో హెడ్‌సెట్‌తో రానుందని సమాచారం.

Apple Cheaper Vision Pro : గత కొన్నేళ్లుగా, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లు మనందరి ఊహలను ఎంతో ఆకర్షించాయి. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ప్రారంభ వీఆర్ హెడ్‌సెట్, ఆపిల్ విజన్ ప్రో ఆవిష్కరించినప్పుడు అభిమానులు కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం రూపొందించిన దాని గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. గత ఏడాదిలో విజన్ ప్రో ప్రారంభ ఆవిష్కరణ సమయంలో ఆపిల్ ఎంపిక చేసిన జర్నలిస్టులకు దాని సామర్థ్యాలను ప్రయత్నించడానికి అన్వేషించడానికి ప్రత్యేక యాక్సస్ అందించింది.

దాంతో మీడియా రివ్యూలు చాలా వరకు సానుకూలంగా ఉన్నాయి. ప్రజలలో దానిపై మరింత ఉత్సాహాన్ని సృష్టించింది. వీఆర్ హెడ్‌సెట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అమ్మకానికి వచ్చింది. అయితే, కొత్త నివేదికలో విజన్ ప్రో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయని పేర్కొంది. అందుకే, టెక్ దిగ్గజం చౌకైన విజన్ ప్రో హెడ్‌సెట్‌తో ముందుకు రావాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆపిల్ చౌకైన విజన్ ప్రోతో రాబోతుందా? :
ది ఇన్ఫర్మేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం.. ఆపిల్ కొత్త హై-ఎండ్ విజన్ హెడ్‌సెట్‌ను డెవలప్ చేయకపోవచ్చు. దానికి బదులుగా, టెక్ దిగ్గజం ప్రస్తుత మోడల్ కోసం కాంపోనెంట్‌ల ధరను తగ్గించే మార్గాలను అన్వేషిస్తోంది. 2025 చివరి నాటికి విడుదల చేయాలనే లక్ష్యంతో విజన్ హెడ్‌సెట్ మరింత సరసమైన వెర్షన్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉంది.

Read Also : Indian Millionaires Migration : విదేశాలకు చెక్కేస్తున్న భారతీయ మిలియనీర్లు.. ఈ దేశానికే ఎక్కువగా వలస వెళ్తున్నారట..!

విజన్ ప్రో హై-రిజల్యూషన్ డిస్‌ప్లేలు, అధునాతన ఫీచర్‌లకు ప్రసిద్ధి చెందింది. అయితే, యూఎస్‌డీ 3,499 నుంచి ప్రారంభమయ్యే ధరతో కూడిన విమర్శలను ఎదుర్కొంది. గణనీయమైన బరువును కలిగి ఉంది. సుదీర్ఘ ఉపయోగానికి తక్కువ సౌకర్యంగా ఉంటుంది. విజన్ ప్రో అమ్మకాలు మందగించడంతో ఆపిల్ తన వ్యూహాన్ని పునరాలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

ది వెర్జ్‌ నివేదిక ప్రకారం.. కొత్త, బడ్జెట్-ఫ్రెండ్లీ హెడ్‌సెట్, కోడ్‌నేమ్ N109, విజన్ ప్రోను వేరుచేసే హై-రిజల్యూషన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, తేలికపాటి నిర్మాణాన్ని సాధించడానికి కొన్ని ఫీచర్లను వదులుకుంటుంది. నివేదిక ప్రకారం.. దాని కన్నా మూడింట ఒక వంతు తేలికైనది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఆపిల్ ఈ కొత్త మోడల్‌ను హై-ఎండ్ ఐఫోన్ రేంజ్‌లో యూఎస్‌డీ 1,500, యూఎస్‌డీ 2,500 మధ్య నిర్ణయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అయినప్పటికీ, ఫీచర్‌లపై రాజీ పడకుండా ఖర్చులను తగ్గించడంలో ఆపిల్ సవాళ్లను ఎదుర్కొందని నివేదిక తెలిపింది. 2025 లక్ష్యానికి మించి హెడ్‌సెట్ లాంచ్ సమయాన్ని మరింత ఆలస్యం చేస్తుంది. ప్రస్తుతానికి, ఈ పరిణామాలపై ఆపిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2024 మార్చిలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ విజన్ ప్రో.. ఈ ఏడాది చివరిలో చైనీస్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. నివేదిక ప్రకారం.. సీసీటీవీ వెయిబో అకౌంట్లలో షేర్ చేసిన వీడియోలో ఆపిల్ సీఈఓ అడిగినప్పుడు చైనాలో విజన్ ప్రోని ఆవిష్కరించినట్టు ధృవీకరించారు.

ఆపిల్ విజన్ ప్రో గురించి :
గత సంవత్సరం జూన్‌లో, కుక్ (WWDC 2023) సమయంలో విజన్ ప్రోని ఆవిష్కరించారు. దీన్ని “కొత్త రకం కంప్యూటర్”గా పేర్కొన్నారు. విజన్ ప్రో బేస్ మోడల్ 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. సోలో నిట్ బ్యాండ్, డ్యూయల్ లూప్ బ్యాండ్, లైట్ సీల్, రెండు లైట్ సీల్ కుషన్‌లు, యాపిల్ విజన్ ప్రో కవర్, పాలిషింగ్ క్లాత్, బ్యాటరీ, యూఎస్‌‌బీ వంటి వివిధ అప్లియన్సెస్ కలిగి ఉంటుంది. యూఎస్‌బీ-సి పవర్ అడాప్టర్‌తో సి ఛార్జింగ్ కేబుల్ అందిస్తుంది.

ఈ కొత్త డివైజ్ ప్రతి కంటికి 4కె డిస్‌ప్లేతో వస్తుంది. వినియోగదారులు సైడ్-మౌంటెడ్ డయల్‌తో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) మధ్య మారడానికి అనుమతిస్తుంది. హెడ్‌సెట్ ఆపిల్ ఇంటర్నల్ M2 చిప్, ఇంటర్నల్ సెన్సార్‌లు, కెమెరాలు, మైక్రోఫోన్‌ల నుంచి డేటాను ప్రాసెస్ చేసేందుకు అంకితమైన కొత్త ఆర్1 చిప్‌ను కలిగిన డ్యూయల్-చిప్ సెటప్‌పై రన్ అవుతుంది. దీనికి అదనంగా, ఆపిల్ డివైజ్ కంటి, తల, చేతి ట్రాకింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు కంట్రోల్ లేకుండా ఇంటర్‌ఫేస్‌ను నావిగేట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

అదనంగా, హెడ్‌సెట్ ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (visionOS)లో రన్ అవుతుంది. యాప్ డెవలపర్‌ల నుంచి అదనపు డెవలప్‌మెంట్ అవసరం లేకుండా చాలా ఐఫోన్లు, ఐప్యాడ్ యాప్‌లతో సజావుగా పనిచేస్తుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన (WWDC 2024)లో ఆపిల్ కొత్త సామర్థ్యాలతో విజన్ఓఎస్ 2ని ఆవిష్కరించింది.

Read Also : Bill Gates on AI : ఏఐతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు ముప్పు ఉందా? బిల్‌గేట్స్ చెప్పిన ఆసక్తికర సమాధానాలివే..!

ట్రెండింగ్ వార్తలు