Bill Gates on AI : ఏఐతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు ముప్పు ఉందా? బిల్‌గేట్స్ చెప్పిన ఆసక్తికర సమాధానాలివే..!

Bill Gates on AI : ఏఐతో ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన సమాధానాలనిచ్చారు. ఏఐ సాంకేతికత, ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

Bill Gates on AI : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే దృష్టిపెడుతోంది. టెక్ కంపెనీల్నీ దాదాపు ఏఐ రంగంలోకి అడుగుపెట్టేశాయి. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏఐ ఉద్యోగాలతో హ్యుమన్ రీసోర్సెస్ భారీగా తగ్గిపోతుందనే అంచనాలు నెలకొన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడిపోతాయా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత 2022లోనే ఏఐ చాట్‌జిపిటి అందరికి అందుబాటులోకి వచ్చేసింది. అప్పటినుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందా? అనే చర్చలు జరిగాయి.

Read Also : Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

టెక్కీల ఉద్యోగాలపై ఆందోళనలు :
ఏఐ చాట్‌బాట్ గతంలో మానవులకు మాత్రమే ప్రత్యేకమైనదిగా పరిగణించే పనులను చేసేది. అందులో కోడ్ రాయడం నుంచి కవిత్వం రాయడం వరకు అన్నింటినీ చాట్‌జీపీటీనే చేయగలదు. రానురాను ఇంకా అభివృద్ధి చెందిన ఏఐ టూల్ స్మార్ట్ వెర్షన్‌లు కూడా రిలీజ్ అయ్యాయి. ఏఐలో ఈ పురోగతితో టెక్కీల ఉద్యోగాలపై ఆందోళనలు పెరిగాయి. ఏఐ భవిష్యత్తులో ఒకరోజున హ్యుమన్ జాబ్స్ ను పూర్తిగా భర్తి చేస్తుందని చాలా మంది సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు.. మనుషులు రాయాల్సిన కోడింగ్‌ను ఏఐ టూల్ నిమిషాల్లో రాసేయగలదు. దాంతో మానవ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు తమ ఉద్యోగాలను కోల్పోతారని ఆందోళన చెందుతున్నారు.

ఏఐతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉంది :
ఏఐతో ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన సమాధానాలనిచ్చారు. ఏఐ సాంకేతికత, ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను భర్తీ చేయలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ యుగంలో కూడా మనకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉందని బిల్‌గేట్స్ అన్నారు. కామత్ పోడ్‌కాస్ట్ సిరీస్ “పీపుల్ బై డబ్ల్యుటిఎఫ్” ప్రారంభ ఎపిసోడ్ కోసం బిల్ గేట్స్ జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో చేరారు. 30-నిమిషాల సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్‌లోని పూర్వపు ప్రారంభ రోజులను, వివిధ పరిశ్రమలపై ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపాంతర ప్రభావంపై లోతుగా చర్చించారు.

ఏఐ కీలక రంగాల్లో సాయపడగలదు :
ఏఐ ప్రభావం పెరుగుతున్నప్పటికీ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తు గురించి గేట్స్ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. భారత్, అమెరికాలో విజయవంతమైన ప్రాజెక్ట్‌లను సూచిస్తూ.. ఉత్పాదకతతో పాటు విద్యా బోధకులుగా పనిచేయడానికి ఏఐ సామర్థ్యాన్ని ఆయన హైలైట్ చేశారు. ఏఐ సాంకేతికతలో అద్భుతమైన విషయం ఏమిటంటే.. కీలకమైన రంగాలలో సాయపడగలదని మాకు తెలుసునని అన్నారు. విద్యా బోధకులను సృష్టించగలదని, భారత్, అమెరికాలో అద్భుతమైన ఫలితాలను చూపుతున్న అనేక ప్రాజెక్ట్‌లను ఇప్పటికే చూశామని చెప్పారు. అవన్నీ మనకు తెలిస్తే.. నమ్మశక్యం కాదని, ఏఐ ఉద్యోగాలను మరింత ఉత్పాదకతగా మార్చిందని గేట్స్ వ్యాఖ్యానించారు.

ఏఐతో టెక్కీల ఉద్యోగాలకు నో రిస్క్ :
ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను భర్తీ చేయగలదనే ఆందోళనలను ప్రస్తావిస్తూ.. గేట్స్ అలాంటి భయాలను తోసిపుచ్చారు. ఏఐతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని, పైగా వారికి ఇంకా డిమాండ్ బలంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. “మాకు ఇంకా ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అవసరం. ఎందుకంటే వారితో ఏఐకి అవసరం ఉంది. ఏఐ పురోగతి కారణంగా ఉద్యోగాలు పోతాయని గురించి ఆందోళన చెందుతున్న టెక్కీలకు బిల్ గేట్స్ ఇచ్చిన ఈ భరోసా మరింత ఓదార్పునిస్తుంది.

రాబోయే 20ఏళ్లలో ఏఐ ప్రభావం ఎంతంటే? :
ఏఐ ఆటోమేషన్ ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకోవచ్చని గేట్స్ అంగీకరించినప్పటికీ.. రాబోయే 20 ఏళ్లలో దీని ప్రభావం అంతగా ఉండదని చెప్పేశారు. వర్క్‌ఫోర్స్‌పై ఏఐ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితిని ఆయన అంగీకరించారు. ఇది సంక్లిష్టమైన సమస్య అని కచ్చితంగా అంచనా వేయడం కష్టమని మైక్రోసాఫ్ట్ అధినేత స్పష్టం చేశారు.

భారత్‌తో బిల్ గేట్స్ ప్రత్యేక అనుబంధం :
ఏఐ గురించి చర్చించడంతోపాటు గేట్స్, కామత్ భారత్‌తో గేట్స్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలతో సహా అనేక ఇతర అంశాలపై ప్రస్తావించారు. మైక్రోసాఫ్ట్ ప్రతిభావంతులైన ఐటీ గ్రాడ్యుయేట్‌లను కంపెనీ విజయానికి ఎలా నియమించుకుందో పేర్కొన్నారు. భారత్‌తో తన అనుభవాలను ఎంతో ఇష్టంగా గేట్స్ గుర్తు చేసుకున్నారు.

భారత్‌తో నాకు అద్భుతమైన సంబంధం ఉందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే నాలుగు ప్రాంతాల్లో 25వేల మంది వారే భారతీయులే ఉన్నారని తెలిపారు. అయితే, మైక్రోసాఫ్ట్ విజయంలో అద్భుతమైన వ్యక్తుల్లో భారత్ నుంచి నియమించిన బృందంలో భాగమేనని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు.

Read Also : Indian Millionaires Migration : విదేశాలకు చెక్కేస్తున్న భారతీయ మిలియనీర్లు.. ఈ దేశానికే ఎక్కువగా వలస వెళ్తున్నారట..!

ట్రెండింగ్ వార్తలు