Vijay Sethupathi Maharaja Collects 100 Crores give Competition to Prabhas Kalki Movie in Tamil Nadu
Maharaja – Kalki : తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా ‘మహారాజ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్ ముఖ్య పాత్రల్లో నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ సినిమాని నిర్మించారు.
తెలుగులో కూడా మహారాజ సినిమా భారీగానే రిలీజయింది. ఓ సరికొత్త స్క్రీన్ ప్లేతో సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మహారాజ సినిమా భారీ హిట్ అయింది. మహారాజ సినిమా ప్రపంచవ్యాప్తంగా తాజాగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇండియాలో 76 కోట్లు, ఓవర్సీస్ లో 25 కోట్ల వరకు మహారాజ కలెక్ట్ చేసింది.
అయితే మహారాజ సినిమా రిలీజయి మూడు వారాలు అవుతుంది. ఇప్పుడు తమిళ్ లో కూడా కల్కి సినిమా హవానే నడుస్తుంది. కల్కి తమిళ్ లో కూడా దాదాపు ఇప్పటివరకు 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. తమిళ్ లో ఇప్పట్లో చెప్పుకోదగ్గ సినిమాలేవు లేకపోవడం, మహారాజ రిలీజయి మూడు వారాలు అవుతుండటంతో కల్కి సినిమాకు మరింత కలిసొచ్చేలా ఉంది. అయితే విజయ్ సేతుపతి మహారాజ సినిమా ప్రభాస్ కల్కికి కాస్తో కూస్తో పోటీ ఇచ్చేలానే ఉంది. లాంగ్ రన్ లో కల్కి తమిళ్ లో కూడా 100 కోట్లు సాధించి మహారాజా సినిమాని దాటించిన ఆశ్చర్యపోనవసరం లేదు.