Kalki Movie Records : ప్రభాస్ ‘కల్కి’ సినిమా అయిదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులు ఇవే..

కల్కి సినిమా రిలీజయిన అయిదు రోజుల్లోనే బోలెడన్ని రికార్డులు సృష్టించింది.

Kalki Movie Records : ప్రభాస్ ‘కల్కి’ సినిమా అయిదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులు ఇవే..

Prabhas Kalki 2898AD Movie Creates Worldwide So Many Records in Five Days only

Kalki Movie Records : ప్రభాస్ కల్కి సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన మ్యాజిక్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో సీన్స్, విజువల్స్ గురించి ప్రేక్షకులతో పాటలు సెలబ్రిటీలు సైతం మాట్లాడుతూ అభినందిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కల్కి సినిమా సునామి సృష్టిస్తుంది. కల్కి సినిమా రిలీజయిన అయిదు రోజుల్లోనే బోలెడన్ని రికార్డులు సృష్టించింది.

Also Read : Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పట్నించి అంటే..?

#ఇప్పటివరకు అయిదురోజుల్లోనే కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
#నైజాంలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి RRR సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసింది. RRR 23 కోట్లతో ఉండగా కల్కి 24 కోట్లు సాధించింది.
#ఒక వీకెండ్ లో ఇండియా మొత్తం మీద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా షారుఖ్ ఖాన్ జవాన్ 520 కోట్ల రికార్డుని బ్రేక్ చేసి 555 కోట్లతో కల్కి టాప్ లో నిలిచింది.
#అమెరికాలో ఫాస్ట్ గా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా కల్కి నిలిచింది.
#అమెరికాలో 12 మిలియన్ డాలర్స్ తో బాహుబలి 2, RRR రికార్డ్ తప్ప అన్ని సినిమాల రికార్డులని దాటేసింది. త్వరలో RRR రికార్డ్ 14 మిలియన్ డాలర్స్ కూడా బద్దలవ్వనుంది.
#మలేషియాలో కలెక్షన్స్ విషయంలో సలార్ ఫుల్ టైం రికార్డ్ ని అయిదు రోజుల్లోనే బ్రేక్ చేసి కల్కి నిలిచింది.
#జర్మనీలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది.
# ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు హనుమాన్ అత్యధికంగా 350 కోట్లతో నిలవగా దాన్ని కల్కి మూడు రోజుల్లోనే బ్రేక్ చేసింది.
#కెనడాలో కూడా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది.
#ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల్లో 191 కోట్లతో కల్కి మూడో ప్లేస్ లో నిలిచింది. RRR 223 కోట్లతో మొదటి ప్లేస్ లో ఉండగా, బాహుబలి 2 సినిమా 217 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.
#5 రోజులు వరుసగా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన ఏకైక సినిమాగా కల్కి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
#ఈ వారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాల కలెక్షన్స్ లో కల్కి మూడో స్థానంలో ఉంది. ఇన్‌సైడ్‌ అవుట్‌2 సినిమా 1 బిలియన్ డాలర్స్ తో మొదటి ప్లేస్ లో, ఎ క్వైట్‌ ప్లేస్‌: డే వన్‌ సినిమా 98 మిలియన్ డాలర్స్ తో రెండో ప్లేస్ లో ఉండగా కల్కి 66 మిలియన్ డాలర్స్ తో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది.
#ఇక బుక్ మై షోలో వరుసగా ప్రతి రోజు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమాగా కల్కి నిలిచింది.
#లోకల్ ఏరియా వైజ్ గా కూడా అనేక ఏరియాలలో కల్కి సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది కలెక్షన్స్ విషయంలో.

ఈ రికార్డులు అన్ని సినిమా రిలీజయిన అయిదు రోజులకే. ఇక ఫుల్ రన్ లో కల్కి సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబడతాయో, ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.