Credit CIBIL Score : బ్యాంకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేస్తున్నారా? మీ క్రెడిట్ స్కోర్ వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే కష్టమే..!

CIBIL Score : బ్యాంకు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఒక క్షణం ఆగండి.. ముందుగా మీ క్రెడిట్ స్కోరు ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఆ తర్వాతే ఏదైనా అప్లయ్ చేసుకోండి. ఎందుకంటే.. ఈ పూర్తి వివరాలను ఓసారి నిశితంగా పరిశీలించండి..

Credit CIBIL Score : మీరు వాహనం లేదా గృహ రుణం లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మీరు అర్హత పొందేందుకు మీకు క్రెడిట్ స్కోర్ మంచిగా ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలి. లేకపోతే మీ దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది. ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ వారి పూర్తి రుణ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్‌(RBI)లో రిజిస్టర్ అయిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (CIC) డేటాబేస్‌లో ఇదంతా స్టోర్ అవుతుంది. రుణం లేదా క్రెడిట్ కార్డ్ కోసం కస్టమర్ దరఖాస్తును పరిశీలిస్తున్నప్పుడు ఈ డేటాను బ్యాంకులు యాక్సెస్ చేస్తాయి.

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (CIC) అంటే ఏమిటి? :
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు మొత్తం నాలుగు సీఐసీలు (TransUnion CIBIL, Experian, Equifax, CRIF High Mark)గా ఉన్నాయి. ఇవన్నీ ఆర్బీఐ నియంత్రణలో పనిచేస్తుంటాయి. అంటే.. రుణగ్రహీతల క్రెడిట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేస్తుంటాయి. వ్యక్తులు, కార్పొరేట్లు, చిన్న, మధ్యస్థ సంస్థలు (SMEలు) సహా వీటిని బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు, నాన్-బ్యాంకు ఫైనాన్షియల్ సంస్థలతో సహా వివిధ రకాల క్రెడిట్ ప్రొవైడర్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు.

Read Also : Check Your Credit Score : క్రెడిట్ స్కోరు ఎంత ఉంటే లోన్ వస్తుంది.. సిబిల్ స్కోరు ఎలా చెక్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

900 అత్యధిక రేటింగ్‌తో 300-900 స్కేల్‌లో రుణగ్రహీతలను రేట్ చేస్తారు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు సాధారణంగా క్రెడిట్ బ్యూరోలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా రుణం ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటాయి. బ్యాంకులు తమ క్రెడిట్ మదింపు ప్రక్రియలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIRలు)ని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందులో సీఐసీలు సహా బ్యాంకులు రెండూ సేకరించిన/ నిర్వహించే క్రెడిట్ సమాచారాన్ని నెలవారీగా లేదా పరస్పరం అంగీకరించిన తక్కువ వ్యవధిలో అప్‌డేట్‌గా ఉంచుకోవాలి.

CIBIL Score

గుడ్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? :
స్కోర్ గరిష్టంగా 900కి దగ్గరగా ఉంటే.. అది మంచిది. 550 నుంచి 700 మధ్య ఉన్న స్కోర్ చాలా బాగుందని అర్థం. అదే 549 స్కోరు అంతకంటే తక్కువగా ఉంటే అది పేలవమైన స్కోరుగా పరిగణించడం జరుగుతుంది. రుణగ్రహీత స్కోర్ 800 కన్నా ఎక్కువ ఉంటే.. సులభంగా తక్కువ వడ్డీ రేటుతో లోన్ లేదా క్రెడిట్ కార్డ్‌ని పొందవచ్చు. మరోవైపు 300కి దగ్గరగా ఉన్న స్కోర్‌లు అంటే.. రుణగ్రహీత రుణం లేదా క్రెడిట్ కార్డ్ పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రీపేమెంట్ ఎలా చేస్తున్నారు అనేదానిపై కూడా రేటింగ్‌లు మారుతాయి. రుణగ్రహీత డిఫాల్ట్ అయితే.. వారి స్కోర్ ఒక్కసారిగా పడిపోతుంది. 500 కన్నా తక్కువకు పడిపోయిన తర్వాత తక్కువ వడ్డీ రేట్లు, రుణాలు లేదా కార్డులు కూడా తదనుగుణంగా తగ్గుతాయి.

సీఐసీల డేటాబేస్‌లో ఏముంది? :
సీఐసీలు ఆర్థిక వ్యవస్థలో అన్ని రుణదాతలు, రుణగ్రహీతల వివరాలను కలిగి ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 158.29 లక్షల కోట్ల రుణ బకాయిలను పర్యవేక్షిస్తున్నారని దీని అర్థం. సీఐసీలు రుణాలలో పాల్గొన్న డైరెక్టర్లు, హామీదారులు, భాగస్వాముల పేర్లను కూడా క్యాప్చర్ చేస్తాయి. ట్రాన్స్‌యూనియన్ (CIBIL) డేటా ప్రకారం.. మార్చి 2023 నాటికి, 36,217 దావా వేసిన అకౌంట్లు ఉన్నాయి. సిబిల్ డేటా ప్రకారం.. బ్యాంకులు రుణం ఎగవేతలకు సంబంధించి రుణగ్రహీతలపై కేసులు నమోదు చేశాయి. ఇందులో రూ. 926,300 కోట్లు ఉన్నాయి. 16,899 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు కూడా ఉన్నారు. ఇందులో రూ. 353,905 కోట్లు ఉన్నాయి.

రుణగ్రహీతలు తమ డేటా సరైనదని ఎలా నిర్ధారించుకోవాలి? :
రుణగ్రహీత డిఫాల్ట్ చేసి ఆ తర్వాత తిరిగి చెల్లించినట్లయితే.. తమ స్టేటస్ అప్‌డేట్ చేశారో లేదో చెక్ చేయడానికి ఒక నెల తర్వాత సీఐసీని సంప్రదించాలి. ఇప్పటికీ డిఫాల్టర్లుగా వర్గీకరించబడి ఉంటే.. వారి రేటింగ్ తత్ఫలితంగా తగ్గినట్లయితే.. దాన్ని సరిదిద్దడానికి సీఐసీ ఆ సమస్యను పరిష్కరించాలి. రుణగ్రహీతలు సీఐసీ నుంచి రిపోర్టును కోరే వరకు వారి క్రెడిట్ రేటింగ్, క్రెడిట్ స్టేటస్ గురించి కస్టమర్లకు తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే.. బ్యాంకుల మాదిరిగా కాకుండా, వాటికి సీఐసీల డేటాబేస్‌కు నేరుగా యాక్సెస్ ఉండదు.

Applying for a loan or card

కస్టమర్లు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయా? :
అవును. సీఐసీలు రుణగ్రహీతల స్థితిని అప్‌డేట్ చేయకపోవడంపై ఆర్బీఐకి అనేక ఫిర్యాదులు అందాయి. డిఫాల్ట్ సమస్యను సరిదిద్దినప్పుడు లేదా తప్పును ఎత్తి చూపినప్పుడు సీఐసీలు నిర్ణీత గడువులోపు చర్య తీసుకోవడంలో విఫలమయ్యాయని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఫలితంగా, చాలా మంది వినియోగదారులు రుణాలు లేదా క్రెడిట్ కార్డులను పొందలేకపోయారు. క్రెడిట్ కార్డ్ హోల్డర్ చెల్లింపులో డిఫాల్ట్ అయినట్టయితే.. అతడు లేదా ఆమె రుణ వాయిదా చెల్లించడంలో విఫలమైతే.. వెంటనే సీఐసీలకు తెలియజేయడం జరుగుతుంది. అయితే, కస్టమర్ చెల్లింపును సరిదిద్దినప్పుడు సీఐసీలు అదే ఆవశ్యకతతో వాటిని తిరిగి వర్గీకరించలేదు.

ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంది? :
గత అక్టోబర్‌లో సీఐసీతో క్రెడిట్ హిస్టరీ అందుబాటులో ఉన్న వ్యక్తులకు సంవత్సరానికి ఒకసారి (జనవరి-డిసెంబర్) క్రెడిట్ స్కోర్‌తో సహా ఉచిత పూర్తి క్రెడిట్ నివేదిక (FFCR)కి సులభంగా యాక్సెస్ అందించాలని ఆర్బీఐ సీఐసీలను కోరింది. ఎఫ్ఎఫ్‌సీఆర్‌ను సౌకర్యవంతంగా యాక్సెస్ చేసేందుకు సీఐసీ వెబ్‌సైట్‌లో లింక్ డిస్‌ప్లే చేయాలి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR)లోని సమస్యలను కస్టమర్‌లు బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అంతేకాదు.. డేటా కరెక్షన్ కోసం కస్టమర్ల అభ్యర్థనను తిరస్కరించడానికి గల కారణాలను రుణదాతలు వినియోగదారులకు తెలియజేయాలని ఆర్బీఐ పేర్కొంది.

Read Also : Credit Card Payments : పేటీఎంలో యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు